వైట్ శారీలో మెరిసిపోతున్న శోభిత
తెలుగు యాక్ట్రెస్ శోభితా ధూళిపాళ(Sobhita Dulipala) ఈసారి నటనతో కాకుండా, అదిరిపోయే ఫ్యాషన్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఇండియన్ కౌచర్ ఈవెంట్ లో మెరిసిన ఆమె సరికొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పిక్స్ లో శోభితా ఐవరీ కలర్ లేస్ శారీ, దానికి మ్యాచింగ్ నెట్ పల్లూ ధరించి కనిపించారు. శారీ కి కాంబినేషన్‌గా మెడలో ఎమరాల్డ్ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరియు సాఫ్ట్ కర్లీ హెయిర్ స్టైల్‌తో దేవకన్యలా మెరిసిపోయారు. ఈ రాయల్ అండ్ క్లాసీ లుక్ కు అందరూ ఫిదా అయిపోయి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.








