ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు
ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటా-పాటా తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు.అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం తన గళాన్ని వినిపించిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని అన్నారు.పాటను ప్రజా ఉద్యమానికి ఆయుధంగా మార్చిన అరుదైన వ్యక్తిత్వం గద్దర్ ది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.








