విజయవాడలో వైసీపీ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్మనందపేట బాప్టిస్ట్ నగర్లో వైసీపీ (YCP) దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా దీక్షా శిబిరం ఏంటని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. నిరుద్యోగులు, బాధితులు ఎవరూ లేకుండా పెయిడ్ ఆర్టిస్టుల (Paid artists)తో దొంగ శిబిరాలు నడుపుతున్నారంటూ టీడీపీ (TDP) ఆందోళన చేపట్టింది. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బుద్దా వెంకన్న (Budda Venkanna) నేతృత్వంలో వైసీపీ దీక్షా శిబిరం వద్దకు తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున వెళ్లారు. మార్గమధ్యలో బుద్దా వెంకన్నను పోలీసులు అడ్డుకుని ఆయన ఇంటికి తరలించారు.








