ఎన్ఆర్ఐ దారపనేని ప్రసాద్‌కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి
శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలంలోని తిమ్మాపురానికి చెందిన ఎన్ఆర్ఐ దారపనేని ప్రసాద్ (Darapaneni Prasad)కు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాద్యతలు అప్పగించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసెటీ (ఏపీఎన్ఆర్ టీ) కంట్రీ కో ఆర్డినేటర్ (Country Coordinator)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయుల సంక్షేమంతోపాటు వారి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో సహాయం చేస్తారు. ఏపీఎన్ఆర్ టీ (APNRT) భారత రాయబార కార్యాలయం, యుఏఈ (UAE) లోని స్థానిక అధికారులతో సమన్వయంగా పనిచేసే అధికారం ప్రభుత్వం కల్పించింది.








