ISRO ₹950 కోట్ల స్పేస్‌పోర్ట్…ప్రైవేట్ చేతుల్లోకి! ఎందుకిలా?
భారత్ అంతరిక్షంలో తన జెండా ఎగరేసిన ప్రతిసారీ మన కళ్ల ముందు కనిపించేది ఒకే పేరు — ISRO.
చంద్రుడి మీదకు భారత్ అడుగుపెట్టినా.. మంగళుడి చుట్టూ తన ముద్ర వేసినా.. వందల కిలోమీటర్ల ఎత్తులో ఉపగ్రహాలను కచ్చితంగా వారి కక్ష్యల్లోకి చేర్చినా.. ప్రపంచం భారత్ వైపు తిరిగి చూసేలా చేసిన సంస్థ ISRO.
తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి మిషన్లు చేయగలదని నిరూపించిన సంస్థ. సాంకేతిక పరిమితులు, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ అద్భుతాలు చేయగలదని చూపించిన సంస్థ. భారత్‌కు అంతరిక్ష రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన సంస్థ.
అలాంటి ISRO నిర్మిస్తున్న దాదాపు ₹950 కోట్ల స్పేస్‌పోర్ట్‌ను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకి నిర్వహించేందుకు ఇస్తున్నారనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎందుకు ఇలా చేస్తోంది?
ISROకు పని తగ్గించుకోవాలనుకుంటోందా? ప్రైవేట్ వాళ్లపై ప్రభుత్వానికి అంత నమ్మకం వచ్చిందా? లేక దీని వెనుక మనకు కనిపించని మరో పెద్ద ప్లాన్ ఉందా? ఇవన్నీ ఈ వార్త చదవగానే వచ్చే ఆలోచనలు, అనుమానాలు.
క్లారిటీ …ISRO తన స్పేస్‌పోర్ట్‌ను అమ్మడం లేదు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో కులశేఖరపట్టణం వద్ద నిర్మిస్తున్న Small Satellite Launch Complex (SLC) ఆపరేషన్, మేనేజ్మెంట్ను అర్హత ఉన్న భారతీయ ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు IN-SPACe Expressions of Interest ఆహ్వానించింది.
అంటే మౌలిక వసతులను ISRO/ప్రభుత్వం నిర్మించింది. ఇక ఆ infrastructureను commercial launch operations కోసం ఒక private entity నిర్వహించే మోడల్ తీసుకొస్తున్నారు. అంతేకాదు.. ఎంపికైన సంస్థకు ISRO సాంకేతిక మార్గదర్శకత్వం, operational support, training, handholding కూడా అందించనుంది.
అంటే ఇది ISRO నుంచి ప్రైవేట్ రంగానికి పారిపోవడం కాదు. ఇది ISRO నిర్మించిన సామర్థ్యాన్ని private sector ద్వారా మరింత పెద్ద commercial ecosystemగా మార్చే ప్రయత్నం మాత్రమే.
అసలు ISRO ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంది?
ఇక్కడే ఈ వార్తలోని అసలు ట్విస్ట్ ఉంది. ఒకప్పుడు భారత్‌లో అంతరిక్ష రంగం అంటే దాదాపుగా ప్రభుత్వ రంగమే. రాకెట్‌ను ISRO తయారు చేయాలి. Satelliteను ISRO తయారు చేయాలి. Launchను ISRO నిర్వహించాలి. Launch infrastructure కూడా ISROదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
భారత్‌లో private space startups వచ్చాయి. రాకెట్లు తయారు చేస్తున్నాయి. Satellites తయారు చేస్తున్నాయి. Space-based servicesపై పనిచేస్తున్నాయి. 2020లో space sector reforms తర్వాత ప్రభుత్వం private sectorకు మొత్తం space value chainలోకి రావడానికి తలుపులు తెరిచింది. IN-SPACe కూడా ISRO, private sector మధ్య single-window interfaceగా పనిచేస్తోంది.
ఇప్పుడు తదుపరి దశ launch infrastructureను కూడా ఈ ecosystemలో భాగం చేయడం.
అంటే.. ISRO ఒక్కటే రాకెట్లు పంపే సంస్థగా ఉండటం నుంచి.. ISRO ఒక పెద్ద space ecosystemకు backboneగా మారుతోంది.
ISROకు ఈ spaceportను స్వయంగా నడపడం చేతకాదా?
ఈ విషయాన్ని సింపుల్ గా అర్దం చేసుకోవాలంటే.. ఇంటిని నిర్మించింది ISRO. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగే commercial businessను private sectorకు ఎక్కువగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఇది తేడా.
ఎందుకిలా చేస్తోంది అంటే… ISROకు ఇంకా పెద్ద పనులున్నాయి! ఇదే అసలైన కారణం.
ఏమిటా పెద్ద పనులు?
ISRO ముందు ఉన్న మిషన్లు చిన్నవి కావు. మనుషులను అంతరిక్షంలోకి పంపే Gaganyaan నుంచి చంద్రుడు, అంతరిక్ష శాస్త్ర పరిశోధనలు, భవిష్యత్ launch vehicles, reusable systems, advanced satellites వరకు ISRO చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమయంలో ప్రతి commercial small-satellite launch కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సమయాన్ని కేటాయించడం ఎంతవరకు సబబు? అందుకే ఒక కొత్త division of labour అవసరం. Commercial launchesను private sector చూసుకోవాలి అని నిర్ణయించారు.
ISRO మాత్రం దేశానికి వ్యూహాత్మకంగా, శాస్త్రీయంగా అత్యంత కీలకమైన మిషన్లపై మరింత దృష్టి పెట్టాలి. దీంతో ISROను చిన్నది అవ్వదు. ISRO చేసే పనిని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది.
అసలు చిన్న satelliteల కోసం ఇంత హడావుడి ఎందుకు?
ప్రపంచం మారుతోంది. చిన్న satellites సంఖ్య పెరుగుతోంది. వాటిని తయారు చేసే companies, startups, research organisations పెరుగుతున్నాయి. అయితే వాటికి ఒక సమస్య ఉంది. Satellite తయారు చేయడం ఒక విషయం. దాన్ని అంతరిక్షంలోకి పంపడానికి launch అవకాశం దొరకడం మరో విషయం. ఇక్కడే SSLV వంటి rockets కీలకం.
ISRO రూపొందించిన SSLV దాదాపు 500 కిలోల వరకు payloadను Low Earth Orbitలోకి పంపగలదు. తక్కువ infrastructure, తక్కువ turnaround time, multiple satellites, launch-on-demand వంటి లక్షణాలతో small-satellite marketను లక్ష్యంగా పెట్టుకుంది.
అంటే రేపు ఒక startup దగ్గర satellite సిద్ధంగా ఉండొచ్చు. మరో కంపెనీ rocket సిద్ధం చేయొచ్చు. కానీ launchpad కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూస్తే business model దెబ్బతింటుంది. అందుకే rocket కంటే launch infrastructure కూడా ఇప్పుడు business assetగా మారుతోంది.
ISROకు ఏం కలిసి వస్తుంది?
ఇక్కడ ప్రయోజనం చాలా పెద్దది. దటిది — ISROపై commercial launch workload తగ్గవచ్చు.రెండోది శ్రీహరి కోట సాధన సామగ్రిని,శక్తిని ను ఇతర ముఖ్యమైన missions కోసం అందుబాటులో ఉంచవచ్చు. ISRO తన annual reportలో కూడా కొత్త SSLV complex ద్వారా Non-Governmental Entitiesకు dedicated launch infrastructure కల్పించడం వల్ల SDSC-SHARలో వారి occupancy period తగ్గుతుందని పేర్కొంది.
మూడోది private sectorకి launch access పెరుగుతుంది. నాలుగోది commercial launch marketలో భారత్ పోటీ సామర్థ్యం పెంచుకోవచ్చు. ఐదోది ISRO తన core scientific and advanced missionsపై ఎక్కువ దృష్టి పెట్టగలదు.
ఈ spaceportను ఎవరు పడితే వారికి ఇచ్చేస్తారా?
ప్రభుత్వం అర్హతలను చాలా కఠినంగా పెట్టింది. ఎంపికయ్యే సంస్థ భారతీయ ownership and controlలో ఉండాలి. కనీసం ఏడు సంవత్సరాల operational experience ఉండాలి. భారీ infrastructure projectsలో అనుభవం ఉండాలి. భారీ turnover, net worth వంటి ఆర్థిక అర్హతలు కూడా ఉండాలి. అంటే ₹950 కోట్ల విలువైన strategic infrastructureను ఒక చిన్న కంపెనీ చేతిలో పెట్టడం కాదు. దాన్ని నిర్వహించే సామర్థ్యం ఉన్న పెద్ద భారతీయ సంస్థ కోసం వెతుకుతున్నారు.
ఏదైమైనా ఈ పరిణామం ISRO బలహీనపడుతున్న సంకేతం కాదు. ISRO నిర్మించిన సామ్రాజ్యం ఇప్పుడు ఒక పెద్ద పరిశ్రమగా విస్తరిస్తున్న సంకేతం.








