అట్లాంటాలో తామా, తానా రక్తదాన శిబిరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) కలిసి అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఎ), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి. అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రాణాలను కాపాడాలనే గొప్ప లక్ష్యంతో కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది.
శ్రీనివాస్ లావు (తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), సోహిని అయినాల (ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), శేఖర్ కొల్లు (ఆర్ ఆర్), మధుకర్ యార్లగడ్డ (ఫౌండేషన్ ట్రస్టీ, తామా చైర్మన్), భరత్ మద్దినేని (బోర్డ్ డైరెక్టర్), సునీల్ దేవరపల్లి (సోషియల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్), సునీత పొత్నూరు (తామా ప్రెసిడెంట్ ఎలక్ట్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అట్లాంటా కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ గారు హాజరయ్యారు. వారి హాజరు ఈ సేవా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన చైతన్య కొర్రపాటి, దీప్తి తాళ్లూరి, మాలతి నాగభైరవ (తానా కళాశాల చైర్), ఆర్తిక (తానా మేట్రిమోనియల్ చైర్), మరియు తిరు చిల్లపల్లి తదితరులతోపాటు స్థానిక తానా, తామా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలను నాయకులు తెలియజేశారు. ఈ మహత్తర కార్యక్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలను కూడా నిర్వాహకులు తెలియజేశారు.








