అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా (Hanumakonda District) యువకుడు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. హసన్పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భారత్ చందర్ రెడ్డి (Bharat Chander Reddy) (29) గత నెల 25న ఫ్లోరిడా రాష్ట్రం టాంపా (Florida State Tampa)లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 75 శాతం కాలిన గాయాలతో అప్పటి నుంచి ఆసుపత్రి ( Hospital)లో చికిత్స పొందుతున్న ఆయన దాదాపు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లిన భరత్ చదువు పూర్తి చేసుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చి వివాహం (Marriage) చేసుకోవాలని భావించారు. ఇంతలోనే జరిగిన అగ్నిప్రమాదం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భరత్ మృతితో గంటూరుపల్లిలో విషాదఛాయాలు అలముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.








