ఆ సంస్థతో సీఎం సోదరులకు సంబంధం లేదు : మంత్రి శ్రీధర్‌బాబు
టెసరాట్ సంస్థ (Tesseract Company)కు భూ కేటాయింపుల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం సోదరులకు భూ కేటాయింపులు చేశారంటూ ఆయన అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ హయాంలో ఎకరం రూ.90 లక్షలకు ఇస్తే, మేం రూ.కోటిన్నరకు ఇచ్చాం. బోర్డు డిసైడ్ చేసిన దానికంటే రూపాయి కూడా తక్కువకు ఇవ్వలేదు.32 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో ఒకటి టెసరాట్ కంపెనీ. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయి. ఆ సంస్థతో సీఎం రేవంత్ సోదరులకు సంబంధం లేదు. సోషల్ మీడియా (social media) పోస్టుల ఆధారంగా ఆయన ఆరోపణలు చేయడం, ఐదు ఎకరాల్లో రూ.34 కోట్లతో ఏర్పాటయ్యే కంపెనీని రూ.200 కోట్ల సంస్థగా కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. పీఎం ఏక్తామల్ (PM Ekta Mall) టెండర్లు పారదర్శకంగా జరిగాయి. పరిశ్రమలు రావొద్దనే హిడెన్ అజెండాతో కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం కలలో మాట అని అన్నారు.








