నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ వద్దకు… పోచారం కీలక వ్యాఖ్యలు
నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ (CM Revanth) వద్దకు వెళ్లి కండువా కప్పుకొన్నట్లు బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy) తెలిపారు. ఆరు నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, సగం నిధులు మాత్రమే ఇచ్చారన్నారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీర్కూరులో కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పోచారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లులు పెండింగ్‌లో ఉండటం వల్ల గుత్తేదారులు పనులు ఆపేశారు. నవంబర్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ నిర్వహించారు. ఆ సమావేశంలో సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించా. సీఎం చెప్పినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Deputy CM Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి (Minister Ponguleti) నిధులు మంజూరు చేయలేదు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పడూ మర్చిపోలేను అని అన్నారు.








