Gen Z తాగుడు కథ కొత్తగా ఉందే.. సర్వేలో షాకింగ్ నిజాలు!
కుర్రాళ్లు ఈ మధ్యన తాగటం బాగా తగ్గించారబ్బా… ఇది నిజమేనా.? ఓ పెద్దాయన మరొక ఆయన్ను అడుగుతున్నాడు. మన జనరేషన్ వేరే అంటున్నాడు ఆయన గర్వంగా…అయితే అసలు జనరేషన్ మారేసరికి మద్య సేవన అలవాటులో ఏం మార్పులు వచ్చాయి?
యువత మద్యానికి దూరమవుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ఫిట్నెస్, క్యాలరీలు, నిద్ర, మరుసటి రోజు పనులు.. ఇవన్నీ చూసుకుంటోంది అంటూ ఈ మధ్య మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ వాటిని వైరల్ చేసే వాళ్ళు కూడా Gen Z బ్యాచ్చే.
ఇవన్నీ చూసి Gen Z అంటే మద్యం బాటిల్ కనిపిస్తే ముక్కు మూసుకుని ప్రక్కకు వెళ్లే తరం అనే ఇమేజ్ కూడా ఏర్పడుతోంది. ఇవన్నీ మధ్యం కంపెనీలకు కంగారు పుట్టిస్తున్న నేపధ్యంలో తాజాగా జరిగిన ఓ గ్లోబల్ సర్వే.. కథలో ఓ చిన్న ట్విస్ట్ కాదు.. ఏకంగా బాటిల్ సైజంత బాటిల్ పేల్చింది.
Gen Z మద్యాన్ని వదిలేయలేదు. కానీ
ఇప్పుడు Gen Z కొత్త స్కీమ్ ఫాలో అవుతోంది. అదేమిటంటే… “మందు ముట్టుకోను” అని గ్లాసును శాశ్వతంగా పక్కన పెట్టడం లేదు.కాస్తంత పద్దతిలా లెక్కలు వేసుకుని మందు పోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంత తాగాలి, ఏది తాగాలి, దాని కోసం ఎంత ఖర్చు చేయాలి, మరుసటి రోజు పరిస్థితి ఎలా ఉండాలి.. ఇవన్నీ లెక్కలు వేసుకుని మరీ పార్టీలు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఒకప్పుడు “ఇంకో రౌండ్ వేయాలా?” అనేది పార్టీలో కీలకమైన ప్రశ్న అయితే, ఇప్పుడు “ఇంత తాగితే రేపు ఏం అవుతుంది?, పొద్దున్నే లేవగలనా, పనులకు ఇబ్బంది అవుతుందా” అనేవి ముఖ్యమైన ప్రశ్నలుగా మారుతున్నాయి.
Ipsos, IWSR, AB InBev కలిసి నిర్వహించిన తాజా అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగే అలవాట్లలో వస్తున్న మార్పులను బయటపెట్టింది. ఇందులోని కొన్ని గణాంకాలు చూస్తే Gen Z గురించి మనం ఇన్నాళ్లు వేసుకున్న లెక్కలు, అంచనాలు పూర్తిగా సరైనవి కావని అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి
Gen Z తాగుడు పెంచిందా, తగ్గించిందా?
2023 చివర్లో legal drinking ageలో ఉన్న Gen Zలో 72 శాతం మంది alcohol తీసుకున్నట్లు అధ్యయనం చెబుతోంది. 2026 మార్చి నాటికి ఈ సంఖ్య 74 శాతానికి పెరిగింది. అంటే Gen Z మద్యం వైపు చూడడం మానేసిందన్న ప్రచారానికి ఈ డేటా అసలు సంభందం లేదు.
అయితే మార్పు ఎక్కడ వచ్చింది?
తాగే పరిమాణంలో, వాళ్లు తీసుకునే జాగ్రత్తలలో మార్పు వచ్చింది. 2023లో ఒక drinking occasionలో సగటున 3.3 drinks తీసుకున్న Gen Z, 2026 నాటికి 3.2 drinksకు వచ్చింది. మొత్తం legal-age consumersలో కూడా ఒక్కో occasionలో సగటు drinks 3.4 నుంచి 3.3కి తగ్గాయి. సంఖ్య చూస్తే పెద్ద తేడా కనిపించకపోవచ్చు. కానీ consumer mindsetలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
“తాగాలి.. కానీ ఎందుకు ఎక్కువగా తాగాలి?” అనే ప్రశ్న మొదలైంది.
ఈ విషయం మద్యం పరిశ్రమకు కూడా అంత చిన్న విషయం కాదు. 79 శాతం మంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో health consciousness ఒకటి. సర్వేలో 79 శాతం మంది తమ ఆరోగ్య ఎంపికలపై మరింత నియంత్రణ కావాలని చెప్పారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు శాతం పాయింట్లు పెరిగింది.
మద్యం తగ్గించడానికి cost, తక్కువగా తాగాలనే కోరిక రెండింటినీ 26 శాతం మంది చొప్పున ప్రధాన కారణాలుగా చెప్పారు. Calories తగ్గించుకోవడం, తక్కువ social eventsకి వెళ్లడం, hangoverను తప్పించుకోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయి.
ఒకప్పుడు రాత్రి పార్టీ తర్వాత ఉదయం లేవకపోయినా పర్లేదు. ఇప్పుడు ఉదయం లేవాలి. పని ఉంది. వ్యాయామం ఉంది. ప్రయాణం ఉంది. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అందుకే “ఈ రాత్రి ఎంత ఆనందం?” అనే లెక్కతో పాటు “రేపు ఎంత ఇబ్బంది?” అనే లెక్క కూడా మొదలైంది. మద్యం విషయంలో కూడా “Buy Now, Regret Tomorrow” మోడల్ నుంచి బయటపడాలని చూస్తున్నట్టుంది.
ఇంతకుముందు బాటిల్ ఖాళీ అయ్యేవరకు కూర్చునే ఓపిక ఉండేది. ఇప్పుడు బాటిల్ ధర చూసి, దాని తర్వాతి రోజు క్యాలెండర్ చూసి, చివరికి మొబైల్ క్యాలిక్యులేటర్ కూడా చూసే పరిస్థితి వచ్చినట్టుంది.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్!
తాగడం తగ్గుతోందంటే మద్యం వ్యాపారం కూడా తగ్గిపోవాలి కదా? కానీ అలా జరగటం లేదు. ఎందుకంటే వినియోగదారుడు తక్కువ తాగుతున్నా, తాను కొనేది మాత్రం మరింత జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.అంటే కాస్ట్లీ మందు వేస్తోందీ జన్ జీ. ఇక్కడే premium alcohol మార్కెట్ కథ మొదలవుతుంది.
2014 నుంచి 2024 మధ్య premium-plus alcohol volumes సంవత్సరానికి సగటున 5 శాతం పెరిగాయి. Premium beer అయితే 5.6 శాతం వృద్ధి సాధించింది.
అంటే కొత్త వినియోగదారుడి లెక్క కొంచెం మారుతోంది. “ఎక్కువ తాగడం కంటే.. తక్కువైనా మంచిదే తాగుదాం.” ఇది చూస్తే మద్యం మార్కెట్లో కూడా “Quantity కన్నా Quality” అనే సిద్ధాంతం వచ్చేసినట్టే అనిపిస్తోంది.
ఈ మార్పుకు మరో పెద్ద ఉదాహరణ no-alcohol beverages. 2019 నుంచి 2024 మధ్య no-alcohol beer మార్కెట్ 50 శాతం పెరిగి దాదాపు 35 million hectolitresకు చేరింది. ప్రపంచ zero-alcohol volumesలో no-alcohol beer దాదాపు 93 శాతం వాటాతో ఇప్పటికీ ఆధిపత్యంలో ఉంది. No-alcohol ready-to-drink beverages 51 శాతం పెరిగాయి. Alcohol-free wine 78 శాతం పెరిగింది. అన్నింటినీ మించి zero-alcohol spirits మాత్రం ఏకంగా 208 శాతం పెరిగాయి.
మారుతున్న drinking habitsలో beerకు మంచి స్థానం దక్కుతోంది. Beer, hard seltzers, flavoured malt beverages, premixed cocktails వంటి “Beyond Beer” categories కలిపి ప్రపంచ alcohol servingsలో సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి.
మద్యం లేకుండా మద్యం మార్కెట్ పెరుగుతోంది!
బాటిల్లో alcohol లేకపోయినా, social experience ఉండొచ్చు. రుచి ఉండొచ్చు. చేతిలో ఒక drink ఉండొచ్చు. పార్టీ వాతావరణం ఉండొచ్చు. అంటే కొందరికి అసలు అవసరం alcohol కాదేమో. ఒక సందర్భంలో తామూ భాగమేనన్న భావన. ఇది రాబోయే రోజుల్లో beverage industryకి చాలా పెద్ద సమస్య కావచ్చు.
ఫైనల్ గా…
ఒకప్పుడు మందు తాగి ప్రపంచాన్ని మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు ప్రపంచాన్ని మర్చిపోకుండా మందు తాగాలనుకుంటున్నారు. కాలం మారింది.. గ్లాసు మాత్రం ఇంకా చేతిలోనే ఉంది!
— సూర్య ప్రకాష్ జోశ్యుల








