ఆర్మీ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
MCRHRDలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్.. భేటీలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలియజేశారు. ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి చూపుతున్న, అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు
దీనికి సానుకూలంగా స్పందిస్తూ దేశ వ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్ లకు ముందు ఆయా తెలంగాణ జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు
విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపై చర్చించిన సీఎం
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరిన ముఖ్యమంత్రి
తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానన్న లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును కొనియాడిన లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, చారిత్రక వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు మూసీ నది పునరుజ్జీవనం అవసరం అని అన్నారు
భేటీలో పాల్గొన్న మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు








