అందరికీ కేటాయించినట్టుగానే ఆ సంస్థకు : ఎంపీ చామల
టెస్సరాక్ట్ సంస్థ (Tesseract Company)కు కేటాయించిన భూములపై బీఆర్ఎస్ (BRS) రాజకీయం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ( Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో బీఆర్ఎస్ హయాంలో 54 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. వారి హయాంలో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల చొప్పున ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక 8 కంపెనీలకు భూ కేటాయింపులు జరిగాయి. ఎకరా రూ.1.50 కోట్లకు కేటాయించాం. 5 ఎకరాలు కావాలని టెస్సరాక్ట్ సంస్థ 2024లో దరఖాస్తు చేసుకుంది. ఏడాదిపాటు పరిశీలించి ఆ సంస్థకు 2025లో భూమిని కేటాయించాం. అందరికీ కేటాయించినట్టుగానే ఆ సంస్థకు కూడా ఎకరా రూ.1.50 కోట్ల చొప్పున ఇచ్చాం. 2025 వరకు టెస్సరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి (Kondal Reddy) డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ (Managing Director) కాదు అని తెలిపారు.








