నిష్ప్రయోజనంగానే పార్లమెంట్ సమావేశాలు ముగిశాయా?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. గురువారం వందేమాతర గీతాలాపన తర్వాత, లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే చివరి రోజు సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం హాజరయ్యారు. దాదాపు 19 రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి కానీ, ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండా, ప్రతి రోజూ వాయిదాలకే పరిమితమైంది.
జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై, నిరసనకారులపై జరిగిన లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్ వాడకంపై అమిత్ షా లోక్ సభలో సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. అంతేకాకుండా సభ లోపల, వెలుపల కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో నిరసనలు కూడా జరిగాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20వ తేదీన ప్రారంభమై.. ఆగస్టు 13వ తేదీతో ముగిశాయి. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్రం విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోపాటు విద్య వ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన బాట పట్టింది. జులై 20వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ రోజు చలో పార్లమెంట్ యాత్రకు సీజేపీ పిలుపునిచ్చింది.
అదే విధంగా పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లుతోపాటు పలు బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీ ఛార్జ్‌కు ఎవరు ఆదేశాలు ఇచ్చారో సభలో ప్రకటన చేయాలంటూ కేంద్రాన్ని ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో సభలో దాదాపుగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు ఈ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభ్యులంతా కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌తోపాటు సభ్యులంతా హాజరయ్యారు. జాతీయ గీతంలోని ఆరు చరణాలను పూర్తిగా ఆలపించిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో వర్షాకాల సమావేశాలు ముగిసినట్లు అయింది.








