రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి, ఆమె అందం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు, భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న రకుల్, ప్రస్తుతం బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ, ఫాలోవర్లకు టచ్ లో ఉండే రకుల్ తాజాగా ట్రెండీ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోల్లో రకుల్ రెడ్ కలర్ షోల్డర్ లెస్ కాలమ్ ఫ్రాక్ ధరించి ఎంతో అందంగా కనిపించింది. ఈ డ్రెస్ లో రకుల్ ను, ఆమె అందాలను చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయి, వాటిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.








