రవితేజ కెరీర్ లో ఎన్నడూ లేనివిధంగా!
రవితేజ(ravi teja) కెరీర్లో ఇరుముడి(Irumudi) సినిమా స్పెషల్ ప్లేస్ సంపాదించబోతోందనే సంకేతాలు ప్రమోషన్ల నుంచే కనిపిస్తున్నాయి. సాధారణంగా తన సినిమాల గురించి రిలీజ్ కు ముందు పెద్దగా మాట్లాడని రవితేజ, ఈ సినిమా విషయంలో మాత్రం అసాధారణ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రేక్షకుల తీర్పునే ఎక్కువగా నమ్ముతానని చెప్పే ఆయన, ఈసారి సినిమా పట్ల తనకు ఉన్న ఎమోషనల్ బాండింగ్ ను ఓపెన్ గా షేర్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో పాటూ ఆయన చేసిన సందేశం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రవితేజ ఈ సినిమాను ప్రతి తండ్రికి, ప్రతి కూతురికి, ప్రతి కుటుంబానికి డెడికేట్ చేస్తున్నట్లు చెప్పడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఆ మాటల్లో కనిపించిన ఎమోషన్, ఆయన పోషించిన పాత్రతో ఏర్పడిన బాండింగ్ ను ప్రతిబింబించినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలో బేబీ నక్షత్ర(Nakshatra) ఆయన కూతురిగా నటిస్తుండగా, ప్రియా భవాని శంకర్(Priya bhavani Shankar) హీరోయిన్ గా కనిపించనున్నారు. డైరెక్టర్ శివ నిర్వాణ(Shiva Nirvana) ఎమోషన్, డెప్త్, ఫ్యామిలీ బాండింగ్స్ ను కలిపి సమకాలీన అంశమైన బాలికల భద్రతను ప్రధానంగా తీసుకుని కథను రూపొందించినట్లు ట్రైలర్ సూచిస్తోంది.
ట్రైలర్‌కు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు ప్రధాన బలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భావోద్వేగం, యాక్షన్, కుటుంబ అనుబంధాల మేళవింపుతో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించగా, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








