ఇండస్ట్రీలో కొత్త సెంటిమెంట్… మమిత ఏడిస్తే బ్లాక్‌బస్టర్?
తెలుగు సినీ పరిశ్రమలో హిట్ సెంటిమెంట్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో కొత్త సెంటిమెంట్ హీరోయిన్ మమిత బైజు(mamitha byju) చుట్టూ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్(Ravi shankar) చేసిన కామెంట్స్ ఈ డిస్కషన్‌కు కారణమయ్యాయి. ఆయన మాటల్లో, మమిత ఏ సినిమాలో ఏడ్చినా ఆ ఎమోషన్ ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవుతుందని, ఆమెతో పాటు ఆడియన్స్ కూడా ఎమోషనల్ అవుతారని అన్నారు. అదే సినిమాను బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టే ప్రధాన కారణంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రవి శంకర్ నిర్మాతగా మమితతో డ్యూడ్(Dude) సినిమా చేయగా, ఆమె యాక్టింగ్ లోని ఎమోషనల్ ఇంటెన్సిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విశ్వనాథ్ & సన్స్(Vishwanath& sons) ట్రైలర్లో మమిత కేవలం ఏడవడం మాత్రమే కాకుండా, సూర్య క్యారెక్టర్ ను కూడా ఎమోషన్‌కు గురిచేసే సన్నివేశాలు కనిపిస్తున్నాయంటే సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సూర్య(Suriya) హీరోగా, వెంకీ అట్లూరి(venky atluri) దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ & సన్స్ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్‌పై నాగ వంశీ(naga vamsi) నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌కు ముందే మమిత యాక్టింగ్‌పై ఇలాంటి ప్రశంసలు రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.








