టైమ్ మెషీన్‌తో శర్వానంద్ గేమ్ స్టార్ట్.. శ్రీను వైట్ల భారీ ప్లాన్!
చార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand) తన తర్వాతి సినిమాను సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu vaitlla)తో చేయనున్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జార్జ్ కృష్ణ(George Krishna) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను ఆగస్టు 14న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల ఎంటర్టైన్మెంట్కు ప్రాధాన్యం ఉన్న కథతో వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ టైమ్ మెషీన్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాంటసీ అంశాలను కలిపి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర(Anil Sunkara) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను షూటింగ్ ప్రారంభానికి ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్(Anup Rubens) ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
జార్జ్ కృష్ణ సినిమాను సంక్రాంతి 2027 బరిలోకి తీసుకురావాలనే టార్గెట్ తో చిత్రబృందం ముందుకు సాగుతోంది. రిలీజ్ డేట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని, అందుకోసం ప్రస్తుతం స్పెషల్ మేకోవర్‌పై పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, శర్వానంద్ ఇప్పటికే సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి(Bhogi) సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను కూడా త్వరలో అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. శర్వానంద్ వరుసగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ ప్రాజెక్టులు సూచిస్తున్నాయి.








