కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పై హైకోర్టు స్టే
కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీముబారక్ (Shaadi Mubarak) పథాకలపై తెలంగాణ హైకోర్టు (High Court) స్టే విధించింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ ( Vijay Gopal) ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో హైకోర్టు విచారణ చేపట్టింది. చట్టసభల్లో తీర్మానం చేయకుండా తీసుకొచ్చిన పథకాలు చెల్లవని విజయ్ గోపాల్ వాదించారు. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాలైనా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్టే (Stay) విధించిన ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.








