మస్క్‌కు రోజుకు రూ.8,350 కోట్లు ఎవరు ఇస్తున్నారు?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
మనలో చాలామంది నెల జీతం ఎప్పుడు పడుతుందా అని క్యాలెండర్ వంక రోజూ చూస్తుంటాం. EMIలు, subscriptions, rent, food delivery.. ఇవన్నీ పోను అకౌంట్లో ఏం మిగిలిందో లెక్కలు వేసుకుంటాం. కానీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లైఫ్‌లో మాత్రం మనీ గేమ్ వేరే లెవిల్.
ఆయన సంపద ఒక్క రోజులో సగటున దాదాపు రూ.8,350 కోట్లు! ఒక్కసారి ఆ నెంబర్ ని మీ మెండ్లో ప్రాసెస్ చేయండి.
₹8,350 కోట్లు. ఒక్క రోజు.
అంటే మనం ఉదయం Instagram reels చూస్తూ, coffee తాగుతూ, office లేదా collegeకి వెళ్తున్న టైమ్‌లో..కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసే టైమ్ లో మస్క్ సంపద మాత్రం వేల కోట్ల చొప్పున ముందుకు మూవ్ అవుతోంది.
ఇక్కడే మీరు వచ్చే పెద్ద డౌట్. Bro… ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు? అని. ఏదైనా కంపెనీ రోజూ శాలరీ గా ఇస్తుందా? లేదంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా? ఇవన్నీ కాదని మస్క్ కు సీక్రెట్ గా మనీ ప్రింటర్ ఏదైనా ఉందా?
కంగారుపడకండి.అలాంటిదేమీ లేదు..మరి..డబ్బు మేటరేంటి అంటారా.. ఇక్కడే ఈ స్టోరీ ఇంట్రస్టింగ్ అవుతుంది. ఎందుకంటే మస్క్ కి పనిగట్టుకుని రోజూ రూ.8,350 కోట్లు ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఆయన బ్యాంక్ అకౌంట్లో రోజూ అంత డబ్బు పడటం లేదు.
అసలు జరుగుతున్నది ఇంకో గేమ్.
మస్క్ కి కొన్ని ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారీ ownership ఉంది. ఆ కంపెనీల విలువ పెరిగితే.. వాటిలో ఆయనకు ఉన్న షేర్ విలువ కూడా పెరుగుతుంది.
అంటే… మస్క్ చేతిలో కొత్తగా ఒక్క రూపాయి కూడా క్యాష్ గా రాకపోయినా.. ఆయన మొత్తం ఆస్ది మాత్రం ఒక్కసారిగా వేల కోట్ల మేర పెరిగిపోవచ్చు.
ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ దగ్గర ఒక startupలో 10% shares ఉన్నాయనుకోండి. ఆ స్టార్టప్ value ₹10 లక్షలు ఉంటే మీ వాటా విలువ ₹1 లక్ష. అదే స్టార్టప్ ఒక్కసారిగా ₹1 కోటి వాల్యూషన్ కి వెళ్లిందనుకోండి. మీరు ఒక్కరోజు అదనంగా పని చేయలేదు. ఒక్క రూపాయి శాలరీ కూడా పెరగలేదు. కానీ మీ షేర్స్ వాల్యూ ₹10 లక్షలకు చేరింది. మస్క్ విషయంలో ఇదే కాన్సెప్టు వర్కవుట్ అవుతోంది. కానీ స్కేల్ మాత్రం నెక్ట్స్ లెవెల్.
ఇప్పుడు ఈ money roller-coasterలో SpaceX చాలా కీలకం. SpaceXలో మస్క్‌కు సుమారు 38% వాటా ఉంది. కంపెనీ వాల్యూషన్ లేదా షేర్ రేటు పెరిగితే.. ఆయన వాటా విలువ కూడా భారీగా పెరుగుతుంది.
అందుకే SpaceX share priceలో చిన్న movement కూడా మస్క్ ఆస్ది లో పెద్ద మూమెంట్ తీసుకొస్తుంది.
ఇది ఎంత క్రేజీ అంటే.. SpaceX పబ్లిక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక దశలో మస్క్ సంపద $1.45 ట్రిలియన్, అంటే దాదాపు ₹1.38 లక్షల కోట్లు కాదు.. ₹138 లక్షల కోట్లు! స్థాయికి చేరింది.
అవును. ₹138 లక్షల కోట్లు. ఆ తర్వాత SpaceX shares పడిపోవడంతో ఆయన సంపద $700 బిలియన్ల కంటే దిగువకు, అంటే సుమారు ₹66.8 లక్షల కోట్ల కంటే తక్కువకు కూడా వెళ్లింది. మళ్లీ shares బౌన్స్ అవడంతో ఆయన ఆస్ది $800 బిలియన్లకు, అంటే సుమారు ₹76.4 లక్షల కోట్లకు చేరువైంది.
అంటే అసలు మేటర్… మస్క్ సంపాదన, ఆస్ది అనేది salary meter కాదు. Stock market meter.
ఇక మస్క్ ఇప్పటికే ఫైనాన్స్ గేమ్ ఆడుతున్నాడు. మిగతా ప్రపంచం ఇంకా దాని రూల్స్ నేర్చుకుంటోంది. దటీజ్ మాస్టర్ మస్క్.








