ఎంపీ విజయ్ గొప్ప మనసు.. అభినందించిన కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
దేశాన్ని కాపాడటం కోసం అమరులైన జవాన్ల కుటుంబాలకు ఎంపీ చింతకాలయ విజయ్ (Chintakalaya Vijay) అండగా నిలిచారు. ఏపీ నుంచి ఇటీవల రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడిగా ఎంపికైన చింతకాలయ విజయ్ తన మొదటి జీతాన్ని(Salary) అమరవీరుల కుటుంబాలకు అందించాలని నిర్ణయించారు. తనకొచ్చిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. విరాళంగా అందించిన ఆ చెక్కును భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ (Rajnath Singh)కు అందజేశారు. విజయ్ను రాజ్నాథ్ అభినందించారు.








