ఓఎంఆర్ షీట్లు ప్రైవేటు రిస్టారులో ఎందుకున్నాయి? : మంత్రి డోలా
ఏపీపీఎస్సీ (APPSC)లో సిట్ విచారణతో వైసీపీ నాయకుల అవినీతి బట్టబయలైందని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి (Dola Sri Balaveeranjaneya Swamy) అన్నారు. వైసీపీ హయాంలో గ్రూప్-1 (Group-1) లో జరిగిన అవినీతిపై కోర్టుకు సిట్ ఇచ్చి నివేదికపై రాష్ట్ర ప్రజలకు జగన్ (Jagan) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కష్టపడి చదువుకున్న నిరుద్యోగులతో ఆయన ఆటలాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీపీఎస్సీని గత ప్రభుత్వంలో భ్రట్టుపట్టించారని దుయ్యబట్టారు. 96 శాతం ఓఎంఆర్ షీట్లు తారుమారు చేశారని ఆరోపించారు. ఏపీపీఎస్సీ వద్ద ఉన్న ఓఎంఆర్ షీట్లు 86 రోజులు ఎందుకు ప్రైవేట్ రిసార్ట్ (Private Resort)లో ఉన్నాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోర్టులను పక్కదారి పట్టించిన జగన్, రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామని తెలిపారు.








