ఈ విషయంలో ఆందోళన అవసరం లేదు.. 22ఏ సమస్యలను పరిష్కరిస్తాం :సీఎం రేవంత్
“ఇందిరమ్మ ఇండ్లు ” టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే కూకట్ పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపారు.
ప్రతిపక్షంలో ఉండగా గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో మీరు ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేకపోయా
కానీ ఇప్పుడు కూకట్ పల్లిని అభివృద్ధి చేసుకునేందుకు అన్ని రకాల అధికారం ఉంది
మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి
కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రతీక దృష్టితో అభివృద్ధి చేయాలని శ్రీధర్ బాబు గారిని ఆదేశిస్తున్నా
పదేళ్ల వారి పరిపాలన రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి
తెలంగాణలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం
ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం
ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం
స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం
కడుపులో విషం పెట్టుకుని ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా వెనక్కి తగ్గలేదు
ఆడ బిడ్డలను బస్సులకు యజమానులను చేశాం
పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం
స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లను ఇచ్చాం
ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం
డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్న వాళ్లు మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా?
పట్టణంలో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ కు శ్రీకారం చుట్టింది
మొదటి విడతలో లక్ష ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది
మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా
22 ఏ విషయంలో మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది
ఈ విషయంలో మీకు ఆందోళన అవసరం లేదు..
సోషల్ మీడియాలో కొందరు చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు
పదేళ్ల వారి పాలను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి
నాకు వయసు ఉంది… ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నాం
కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు
అయినా దేవుడు మన వైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు
మంచి మనసుతో అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది
కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి అది తిరిగి వారినే అష్ట దిగ్బంధనం చేస్తుంది
మీరు అండగా ఉండండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.








