కాంగ్రెస్ ఉన్నంత కాలం సెక్యూలర్ శక్తులు ఉంటాయి : సీఎం రేవంత్ రెడ్డి
“మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
హిందూ ముస్లింలు రెండు కళ్లు అని మాటల్లో కాదు.. చేతల్లో చూపించారు సోనియా గాంధీ
మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది
తెలంగాణలో అధికారంలోకి వస్తే మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని అమిత్ షా అన్నారు
తెలంగాణలో కాదు ముందు గుజరాత్ లో తొలగించి చూపించాలని ఆనాడు మేం సవాల్ విసిరాం
మా ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్ పటిష్టంగా అమలు చేసింది
మైనారిటీ యువత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో ఉద్యోగాలు సాధించారు.
మా ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పించాం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మైనారిటీ నుంచి సభ్యుడిగా నియమించాం
కొందరు గ్రూప్స్ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి ఆదుకోవాలని చూసినా.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం
ఎవరూ అడగకపోయినా మైనారిటీలకు దక్కాల్సిన స్థానాన్ని వారికి కల్పించాం
అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇచ్చాం …
నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం కల్పించాం.. రూ. 3 కోట్లు నగదు బహుమతి అందించాం
మహమ్మద్ సిరాజుద్దీన్ కోసం నిబంధనలు సవరించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం
నాకు హిందూ ముస్లింలు ఇద్దరూ సమానమే
హిందూ ముస్లింలు నాకు రెండు కళ్లు
మైనారిటీ యువత చదువుతో పాటు నైపుణ్యం సంపాదించాలి
జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి
విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం
నైపుణ్యం నేర్చుకోండి.. అది మీ జీవితాలను మారుస్తుంది
మీ అందరి సహకారంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా
SIR పేరుతో ఓట్లు తొలగించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు
బెంగాల్ లో గెలిచామని ఇక తెలంగాణనే టార్గెట్ అని కొందరు మాట్లాడుతున్నారు
బెంగాల్ లో మమతా బెనర్జీ వదిలేశారెమో.. ఇక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని నేను చెప్పా
గల్లీ గల్లీ తిరంగండి, ఇంటింటికీ వెళ్లండి.. ప్రతీ ఒక్కరి ఓటును చెక్ చేయండి…
ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కును కోల్పోకుండా చూడండి
ప్రతీ ఒక్కరూ ఒక రేవంత్ రెడ్డిగా మారి ఓటు హక్కును కాపాడాలి.
హాజరైన మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మైనారిటీ నేతలు.








