ఒకప్పుడు ‘Luxury Porn’.. ఇప్పుడు AI Empire! ఎవరీ Cami Clark ?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు “luxury porn” కోసం పెట్టుబడి అడిగిన వ్యక్తి… ఈరోజు ట్రిలియన్ డాలర్ల విలువ దిశగా దూసుకెళ్తున్న AI సామ్రాజ్యం CEOకి భార్యగా ఎలా మారింది?
ప్రపంచ వ్యాప్తంగా ఇపపుడు Anthropic CEO అయిన Dario Amodei పేరు ఇప్పుడు ప్రపంచ AI రేసులో మార్మోగుతోంది. Claudeను తయారు చేస్తున్న ఈ కంపెనీ భవిష్యత్తులో $2 ట్రిలియన్కు పైగా విలువైన సంస్థగా మారే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
కానీ ఆ CEO పక్కన తరచూ కనిపించే ఒక మహిళ గురించి మాత్రం ప్రపంచానికి చాలా తక్కువ తెలుసు. ఆమె పేరు Cami Clark. ఆమె Anthropic ఉద్యోగి కాదు. కంపెనీలో అధికారిక పదవి కూడా లేదు.
అయినా Amodeiకి అత్యంత సన్నిహితమైన వ్యక్తుల్లో ఒకరిగా, ఆయనకు సౌండింగ్ బోర్డ్, స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా ఆమెను తెలిసినవారు అభివర్ణించినట్లు చెప్తారు. Anthropic చుట్టూ ఉన్న పెట్టుబడిదారులు, టెక్ వర్గాలు, రాజకీయ పరిచయాల ప్రపంచంలోనూ Clarkకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఇదంతా చూస్తే ఆమె ఎవరో తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ Cami Clark కథ వాస్తవానికి Anthropic దగ్గర మొదలవ్వలేదు. అది చాలా ఏళ్ల క్రితం, Silicon Valleyలోని AI ల్యాబ్‌లలో కాదు… ఒక పూర్తిగా భిన్నమైన వ్యాపార ఆలోచనతో మొదలైంది.
అప్పటికి Clark ఇంకా Dario Amodei భార్య కాదు. Anthropic అనే కంపెనీ లేదు. Claude అనే AI మోడల్ లేదు. ఆమెకు ఉన్నది ఒక వ్యాపార కల. మహిళల కోసం “Luxury Porn” కంపెనీ. మహిళలను టార్గెట్ చేస్తూ అడల్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు నిర్మించాలి. కంపెనీకి పెట్టుబడి కావాలి.
మొదటి దశలో నాలుగు సినిమాలు తీయడానికి సుమారు $350,000 పెట్టుబడి అవసరం. కానీ పెట్టుబడి కోసం Clark ఎంచుకున్న వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తే షాకింగ్‌గా అనిపిస్తాడు.
Jeffrey Epstein.
అప్పటికే 2008లో సెక్స్‌కు సంబంధించిన నేరంలో నేరాన్ని అంగీకరించి, రిజిస్టర్డ్ సెక్స్ ఆఫెండర్‌గా ఉన్న వ్యక్తి. అయినా 2011లో లిటరరీ ఏజెంట్ John Brockman ద్వారా Clark, Capocefaloలకు Epsteinతో పరిచయం ఏర్పడింది. Brockman వారిని మహిళల మార్కెట్ కోసం పోర్న్ సినిమా తీసేందుకు డబ్బు సమీకరిస్తున్నారని పరిచయం చేశాడు.
మరుసటి రోజే Clark …Epsteinకు మెయిల్ చేశారు. కంపెనీకి ఎంత పెట్టుబడి కావాలో చెప్పారు. కొద్ది రోజులకే తొలి నాలుగు సినిమాల స్క్రిప్టులు కూడా పంపించారు. వాటిలో ఒకటి “American Girl in Paris.”
అంతేకాదు. Clark తమ కంపెనీని తర్వాత “free luxury porn company” అంటూ Epsteinకు మళ్లీ గుర్తు చేశారు. అతని సమాధానం? “Yes, a loud gong.” కానీ పెట్టుబడి మాత్రం రాలేదు.
Epstein చివరికి ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు. లభ్యమైన ఫైల్స్‌లో అతను Eddiceలో పెట్టుబడి పెట్టినట్లు ఆధారం లేదు. కానీ ఇక్కడి నుంచే Cami Clark కథ అసలు ఇంట్రస్టింగ్ గా మారుతుంది
ఎందుకంటే Epstein కథ ఆమె జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. ఆ తర్వాత Clark జీవితంలోకి వచ్చిన వ్యక్తి Eric Schmidt. Google మాజీ CEO. Schmidtతో Clarkకు సుమారు మూడేళ్ల సంబంధం ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. తర్వాత Clark ద్వారా Schmidtకు Dario Amodei పరిచయమయ్యారు.
ఆ పరిచయం తర్వాత ఏమైంది?
Schmidt, Anthropicకు కీలకమైన ప్రారంభ పెట్టుబడిదారుల్లో ఒకరిగా మారారు. 2021లో Anthropic తన $124 million Series A రౌండ్‌ను ప్రకటించినప్పుడు Schmidt పెట్టుబడి పెట్టిన ప్రముఖ వ్యక్తుల్లో ఉన్నారు. అంటే Clark కథలో ఒక విచిత్రమైన కనెక్షన్ కనిపిస్తుంది:
Jeffrey Epstein → Cami Clark → Eric Schmidt → Dario Amodei → Anthropic.
ఇది ఒక్కటే ఏదైనా కుట్రకు రుజువు కాదు.
కానీ ఒక విషయం మాత్రం అసాధారణం.ఆశ్చర్యకరం. ఒకప్పుడు $350,000 కోసం వెతుకుతున్న ఒక చిన్న వెంచర్ ఫౌండర్… కొన్నేళ్లలో ప్రపంచ AI రేసులో అత్యంత కీలకమైన కంపెనీ CEOకి జీవిత భాగస్వామిగా, అనధికారిక సలహాదారుగా ఎలా మారారు?
అదే Cami Clark కథలో అసలు ఇంట్రస్టింగ్ క్వచ్చిన్.
Anthropicలో పదవి లేదు.. అయినా ప్రభావం ఎందుకు? ఇక్కడ మరో పొర బయటపడుతుంది. Clarkకు Anthropicలో అధికారిక హోదా లేదు. కానీ ఆమె పూర్తిగా బయట వ్యక్తి కూడా కాదు. Amodeiకి దగ్గరగా ఉన్నవారు ఆమెను ఆయనకు ముఖ్యమైన సలహాదారుగా అభివర్ణించారు. 2021లో Clark, Schmidtకు “Mother of AGI Fund” అనే ప్రతిపాదన కూడా చేశారు.
40 పేజీల ఈ ప్రపోజల్లో Clark పాత్రను Anthropicతో మరింత అధికారికంగా అనుసంధానించడం, Schmidt పెట్టుబడిని నిర్వహించడం, AI రంగంలోని ఇతర సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టడం వంటి ఆలోచనలు ఉన్నట్లు Wall Street Journal నివేదించింది.
ఆ ప్రతిపాదన చివరికి ముందుకు వెళ్లలేదు. కానీ అది ఒక విషయం మాత్రం చూపించింది. Clarkకు Anthropic చుట్టూ ఉన్న ప్రపంచంలో తన పాత్రను మరింత పెద్దదిగా మార్చాలనే ఆలోచన ఉంది.
ఒకప్పుడు “Luxury Porn”.. ఇప్పుడు Artificial Intelligence
ఇదే ఈ కథలోని అత్యంత విచిత్రమైన కాంట్రాస్ట్. ఒక వైపు Eddice. $350,000 fundraising.Luxury porn. Jeffrey Epstein. మరో వైపు Anthropic. Claude. Artificial Intelligence. Eric Schmidt. Silicon Valley. ట్రిలియన్ డాలర్ల భవిష్యత్తు. మధ్యలో ఉన్న పేరు ఒక్కటే. Cami Clark.
ఆమె కథను కేవలం “Epsteinతో సంబంధం ఉన్న మహిళ”గా చూడటం చాలా సులభం. కానీ బయటపడుతున్న సమాచారం మరో కథ చెబుతోంది. ఇది ఒక మహిళ తన జీవితంలో పదేపదే కొత్త ప్రపంచాల్లోకి ప్రవేశించిన కథ. ఎంటర్టైన్మెంట్ నుంచి మహిళల ఆరోగ్య రంగం వరకు. అక్కడి నుంచి Silicon Valley వరకు. అక్కడి నుంచి AI. చివరికి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన AI కంపెనీలలో ఒకదాని CEO పక్కన. మరి ఎందుకు ఇంతకాలం ఆమె గురించి పెద్దగా తెలియలేదు?
ఇదే చివరి మిస్టరీ.
Dario Amodei గురించి ప్రపంచానికి తెలుసు. Anthropic గురించి తెలుసు. Claude గురించి తెలుసు. కానీ ఆయన భార్య గురించి మాత్రం చాలా తక్కువ సమాచారం. అంతేకాదు, Wall Street Journal ప్రకారం ఆమె డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే ప్రయత్నాలు కూడా జరిగాయి. Anthropic సొంత AI Claudeకే Amodei భార్య గురించి అడిగితే స్పష్టమైన సమాచారం దొరకని పరిస్థితి ఉందని రిపోర్ట్ చెబుతోంది.
అందుకే Cami Clark కథ ఇప్పుడు ఒక్కసారిగా ఆసక్తి రేపుతోంది.
ఎందుకంటే ఇది కేవలం ఒక CEO భార్య కథ కాదు. ఇది Silicon Valleyలో పవర్ ఎలా పనిచేస్తుందో చూపించే కథ. ఎవరికి అధికారిక పదవి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరు పెట్టుబడిదారులను పరిచయం చేస్తారు? ఎవరు CEOకు సలహా ఇస్తారు? ఎవరి పేరు కంపెనీ ఆర్గనైజేషన్ చార్ట్‌లో ఉండదు…కానీ CEO నిర్ణయాల గదికి మాత్రం వారి ప్రవేశం ఉంటుంది?
2011లో Cami Clarkకు కావాల్సింది $350,000.
2026లో ఆమె చుట్టూ తిరుగుతున్న ప్రపంచం మాత్రం ట్రిలియన్ డాలర్ల AI.
కంక్లూజన్
AI మన భవిష్యత్తును మార్చబోతోంది. కానీ ఆ భవిష్యత్తును నిర్మిస్తున్న వారి గతం ఎంతవరకు మనకు తెలుసు? స్క్రీన్‌పై కనిపించేది Claude.
కానీ దాని వెనుక ఉన్న మనుషుల కథలో.. ఇంకా ఎన్ని “hidden connections” బయటకు రావాల్సి ఉంది?








