అనిల్ రావిపూడి ఎఫెక్ట్.. సంక్రాంతికి నవ్వులే పర్ఫెక్ట్!? 2027లోనూ అదే సీన్ రిపీట్?
భోగి మంటలతో మొదలవుతుంది తెలుగు వారి సంక్రాంతి.
చలికాలపు తెల్లవారుజామున ఇంటి ముందు మంటలు. ఆ తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు.
గొబ్బెమ్మలు. కొత్త బట్టలు. పిండివంటల వాసన. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తలు, మామలు, బంధువులతో నిండిపోయే ఇళ్లు. పట్టణాల్లో ఉన్నవాళ్లు పల్లెలకు బయలుదేరుతారు. పల్లెల్లో ఉన్నవాళ్లు బంధువుల కోసం ఎదురుచూస్తారు.కోడి పందాలు.గుండాటలు.
కొత్త అల్లుడు ఇంటికి రావడం నుంచి.. కనుమ రోజు కుటుంబమంతా కలిసి భోజనం చేయడం వరకు..పెద్ద ఉత్సవంలా సాగుతుంది. ఈ పండుగలో మరో పండుగ ఎప్పుడు చేరిందో మనకు తెలియకుండానే జరిగిపోయింది. అదే సినిమా పండగ. సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా కొత్త సినిమా చూడాలి అన్న భావన తెలుగు కుటుంబ జీవనంలో దాదాపు ఒక భాగమైపోయింది.
కాబట్టే సంక్రాంతి అంటే తెలుగు పరిశ్రమలో ఒక రిలీజ్ డేట్ గా చూడరు. అది ఒక బిజినెస్ మోడల్ గా గమనిస్తారు. సంవత్సరం ప్రారంభంలో వచ్చే ఆ కొన్ని రోజులు నిర్మాతలకు ఏడాది మొత్తం కలలో కనిపించే బాక్సాఫీస్ విండో. కుటుంబాలు కలిసి సినిమాలకు వెళ్లే సమయం. థియేటర్లకు అదనపు షోలు వేసే సమయం. స్టార్ హీరోలు తమ మార్కెట్‌ను పరీక్షించుకునే సమయం.
చాలా కాలంగా సంక్రాంతి అంటే ఒకే రకమైన పోటీ కనిపించేది. కృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు, ఆ తర్వాత కాలంలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ. వెంకటేష్ వర్సెస్ నాగార్జున. స్టార్ వర్సెస్ స్టార్.కానీ ఇప్పుడు ఆ పోటీ స్వభావమే మారుతున్నట్టుంది.
2025 నుంచి 2027 వరకు సంక్రాంతి సినిమాలను వరుసగా చూస్తే ఒక ఆసక్తికరమైన pattern కనిపిస్తుంది.
సంక్రాంతి ఇక “ఎవరి స్టార్ పవర్ ఎక్కువ?” అన్నట్లు కాకుండా “ఎవరి సినిమా కుటుంబాన్ని థియేటర్‌కు తీసుకువచ్చి, అక్కడ రెండు మూడు గంటలు నవ్వించగలదు?” అనే ప్రశ్నగా మారింది.
ఈ మార్పుకు ఒకే వ్యక్తిని కారణంగా చూపడం కొంచెం అతిశయోక్తి కావచ్చు. కానీ ఒక దర్శకుడి ప్రభావాన్ని మాత్రం విస్మరించడం కష్టం. అతనే అనిల్ రావిపూడి.
2025: ఒక కామెడీ సినిమా..పోటిగా రెండు భారీ యాక్షన్ సినిమాలు
ఒకవైపు Game Changer.
శంకర్ దర్శకత్వం. రామ్ చరణ్ స్టార్ పవర్. భారీ నిర్మాణ విలువలు. పొలిటికల్ యాక్షన్ డ్రామా.
మరోవైపు బాలకృష్ణ డాకూ మహారాజ్. మాస్ హీరో. యాక్షన్. భారీ ఇమేజ్.
మూడో వైపు?
వెంకటేష్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో Sankranthiki Vasthunam. పేపర్ మీద చూస్తే అది ఈ రెండింటి కంటే “చిన్న” సినిమా. కానీ సంక్రాంతి బాక్సాఫీస్‌కు సినిమా పరిమాణం కన్నా మరో విషయం ముఖ్యం అని అది గుర్తు చేసింది. అదే సందర్భం. సంక్రాంతికి ప్రేక్షకుడు ఒంటరిగా థియేటర్‌కు రావడం లేదు. కుటుంబంతో వస్తున్నాడు. భార్యతో వస్తున్నాడు. పిల్లలతో వస్తున్నాడు. తల్లిదండ్రులతో వస్తున్నాడు. అతను యాక్షన్ చూడటానికి సిద్ధంగా ఉండొచ్చు. కానీ కుటుంబమంతా కలిసి నవ్వుకోవడానికి ఇంకా ఎక్కువగా సిద్ధంగా ఉన్నాడు. Sankranthiki Vasthunam భారీ విజయాన్ని అందుకోవడం ఈ behavioural insightకు commercial validation ఇచ్చింది.
అది కేవలం వెంకటేష్ స్టార్ పవర్ సక్సెస్ కాదు. అలాగని అనిల్ రావిపూడి కామెడీ విజయం కూడా కాదు. “Family + Comedy + Sankranthi” అనే కాంబినేషన్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో మార్కెట్‌కు గుర్తు చేసిన విజయం. అనిల్ రావిపూడి అసలు చేసింది ఇదే.
ఇక్కడ అనిల్ రావిపూడి కామెడీని ఒక జానర్ గా కాకుండా commercial infrastructureగా ఉపయోగించాడు. అతని సినిమాల్లో కామెడీ కథకు బయట నడిచే ట్రాక్ కాదు. అది హీరోను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసే బ్రిడ్జి. ముఖ్యంగా అది రిపీట్ ఆడియన్స్ ను తయారు చేసే వెపన్.
సంక్రాంతి లాంటి సీజన్లో దీని విలువ మరీ ఎక్కువ. ఎందుకంటే పండుగ సినిమాకు ప్రేక్షకుడు “నేను ఏ సినిమా చూడాలి?” అని మాత్రమే ఆలోచించడు. “మా ఇంట్లో అందరూ ఏ సినిమా చూడగలరు?” అని కూడా ఆలోచిస్తాడు.
2025 తర్వాత ఇండస్ట్రీ ఏం నేర్చుకుంది?
ఒక హిట్ సినిమా నుంచి ఇండస్ట్రీ సాధారణంగా కథను కాపీ చేయదు. ఆ సినిమా వెనుక ఉన్న consumer behaviourను కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే ఇక్కడ జరిగింది. అక్కడే 2026 interesting గా మారింది.
2026 సంక్రాంతి లో కూడా comedy, family entertainment, light-hearted commercial సినిమాలు ప్రధానంగా కనిపించాయి. అంటే 2025లో ఒక successful product కనిపించింది. 2026లో market అదే డైరెక్షన్ లో ప్రయోగాలు చేసింది.
2026 సంక్రాంతి కి చిరంజీవి అనీల్ రావిపూడి మన శంకర వర ప్రసాద్ గారు, ది రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి,నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు వచ్చాయి. ఇక్కడ ది రాజా సాబ్ తప్పిస్తే మిగతావన్నీ కామెడీ ప్రధానంగా నడిచినవే.సక్సెస్ అయ్యినవే.
ఇప్పుడు 2027లో?
ఆ direction మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2027: ఇప్పుడు కామెడీ ఒక జానర్ కాదు.. ఒక battlefield గా మారింది. ప్రస్తుతం కనిపిస్తున్న సంక్రాంతి లైనప్‌ను చూస్తే అది అర్దం అవుతుంది.
జనవరి 13 — వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా
ఇక్కడ దర్శకుడి పేరు ఒక్కటే చాలా చెబుతుంది.
తర్వాత—
జనవరి 14 — శర్వానంద్, శ్రీను వైట్లల George Krish
శ్రీను వైట్ల పేరు కూడా తెలుగు ప్రేక్షకుడికి కామెడితో బలంగా అనుసంధానమై ఉంది.
మరోవైపు
కార్తి–కళ్యాణ్ శంకర్ సినిమా. ఇది కూడా సంక్రాంతి entertainment spaceలో కనిపిస్తోంది. కళ్యాణ్ శంకర్ గతంలో మ్యాడ్ , మ్యాడ్ స్క్వేర్స్ వంటి కామెడీలు చేసాడు.
మూడు సినిమాలను ఒకే జానర్ గా ముద్ర వేయడం సరికాదు. కానీ మార్కెట్ పొజీషినింగ్ లో కామన్ థ్రెడ్ మాత్రం ఉంది.మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని ఆడియన్ అడుగుతున్నాడు. ఇది ముఖ్యమైన విషయం.
మరొక పెద్ద మార్పు: స్టార్ల గైర్హాజరీ
చిరంజీవి సంక్రాంతి 2027 కోసం అనుకున్న సినిమా ఆలస్యం అవుతోంది. బాలకృష్ణ సినిమా విషయంలో ప్రస్తుతానికి రిలీజ్ స్పష్టత లేదు. నాగార్జున సంక్రాంతి ప్రాజెక్ట్ కూడా రేసు నుంచి తప్పుకుంది. దీంతో ఒకప్పుడు ఊహించిన “Senior Star Sankranthi” అనేది మాయమైంది.
ఫార్ములాకు పరీక్ష
2025లో అనిల్ రావిపూడి సంక్రాంతి family entertainmentకు భారీ commercial validation ఇచ్చాడు. 2027లో మళ్లీ సంక్రాంతికే వస్తున్నాడు. కానీ ఈసారి అతని territory ఖాళీగా లేదు. అదే seasonలో మరో comedy-oriented filmmaker ఉన్నాడు. మరో entertainment-driven film ఉంది. అంటే అనిల్ రావిపూడి తనకు బాగా తెలిసిన మార్కెట్లోనే ఇప్పుడు పోటీ పడుతున్నాడు.ఇది ఆయనకు ఒక ప్రత్యేకమైన పరీక్ష.
ఒక ఫార్ములాను సృష్టించడం కంటే దాన్ని మళ్లీ repeat చేసి, ప్రేక్షకుడికి కొత్తగా అనిపించేలా చేయడం చాలా కష్టం. ఈ సారి అనీల్ రావిపూడి ఏం మ్యాజిక్ చేసి తను క్రియేట్ చేసిన పోటీలో కామెడీ కోడిపందెంలో ఎలా గెలుస్తాడో చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








