15th August 2026

_________

- Bhuvana

తులసి మొక్క సడెన్‌గా ఎండిపోయిందా? ఈ తప్పే కారణం కావచ్చు!

ఇంట్లోని తులసి మొక్క ఎంతో శ్రద్ధగా చూసుకున్నా సడెన్‌గా ఎండిపోతుంటుంది. దీనికి కొన్ని చిన్న పొరపాట్లే కారణం కావచ్చు!

తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతోందా?

చాలామంది తులసికి రోజూ ఎక్కువగా నీళ్లు పోస్తుంటారు. ఎక్కువ తడి వల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క త్వరగా చనిపోతుంది.

నీటి సమస్య 

అదేవిధంగా కొన్ని రోజులు నీరు పోయకపోతే, ఎండ తీవ్రతకు మట్టి పూర్తిగా ఎండిపోయి తులసి మొక్క వాడిపోయి రాలిపోతుంది.

నీటి కొరత

తులసి మొక్కకు రోజుకు కనీసం 4 నుండి 6 గంటల పాటు నేరుగా మంచి ఎండ తగలాలి. చీకటిగా ఉండే చోట ఇది బతకలేదు.

సూర్యకాంతి లేకపోవడం

కుండీలోని మట్టి గట్టిపడిపోతే వేర్లకు గాలి అందదు. అందుకే గుల్లగా ఉండే సారవంతమైన మట్టిని ఎప్పుడూ ఉపయోగించాలి.

మట్టి నాణ్యత లోపం

మొక్క ఎదుగుదలకు తగినంత పోషకాలు అందకపోతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. ఎరువులు సరిగ్గా అందించాలి.

పోషకాల కొరత

ఆకులపై తెల్లని పురుగులు లేదా పేనుంకి ఆశించి రసాన్ని పీల్చేస్తాయి. దీనివల్ల మొక్క క్రమంగా ఎండిపోతుంది.

తెగుళ్ళు, పురుగుల బెడద

ఫంగస్ ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల వేర్లు దెబ్బతింటాయి. తద్వారా మొక్కకు అందవలసిన పోషకాలు అందక ఎండిపోతుంది.

వేర్ల వ్యాధులు

అతి చలి లేదా అతిగా కురిసే వర్షాల కారణంగా కూడా తులసి మొక్కలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వాతావరణ మార్పులు

తులసికి తగినంత ఎండ, మితంగా నీరు అందిస్తూ, ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కట్ చేస్తే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది!

ఇలా జాగ్రత్త వహించండి!