గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి?
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎస్సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించబోతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah)తో పాటు రాయలసీమ (Rayalaseema) నుంచి టీడీపీ అనంతపురం ( Anantapur) లోక్‌సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి (Dalavai Ramadevi) పేర్లను ప్రతిపాదించినట్లు సమచారం. త్వరలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ సీనియర్ నాయకుడైన వర్ల రామయ్య గతంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ (Tirupati Lok Sabha) స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు.








