పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? : బండి సంజయ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ భారత్లో మంచి కాలేజీలు లేవని కేటీఆర్ అంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? రాష్ట్రంలో మంచి స్కూళ్లు (Schools), కాలేజీలు (Colleges) ఎందుకు ఏర్పాటు చేయలేదు? పదేళ్ల పాటు సరిపడా టీచర్లను ఎందకు నియమించలేదు? యూనివర్సిటీల్లో (Universities) ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదు? స్కూళ్లు బాగాలేవని కొన్నాళ్ల క్రితం కేసీఆర్ (KCR) మనవడు చెప్పారు. కాలేజీలు బాగా లేనని ఇప్పుడు కేసీఆర్ మనవరాలు చెబుతోంది అని అన్నారు.








