తోట లక్ష్మీకాంతరావు కుమార్తె ఎంగేజ్మెంట్కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు (Thota Lakshmikantha Rao) కుమార్తె ఎంగేజ్మెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరయ్యారు. హెలికాప్టర్లో బిచ్కుంద మండలం కందరపల్లికి వచ్చిన సీఎం, వేదిక వద్దకు చేరుకొని కాబోయే దంపతులు జోనిటా( Jonita), దాస్ ( Das)కు పుష్పగచ్చం అందించి ఆశీర్వదించారు. వేడుకకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), రాజ్యసభ సభ్యుడు మేం నరేంద్ రెడ్డి (Narendra Reddy), రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి తదితరులూ హాజరయ్యారు.








