ప్రభుత్వంతో సమాధానాలిప్పించే బాధ్యత నాది : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
డీఎస్సీ (DSC), ఇతర అంశాలపై వైసీపీ అధినేత జగన్ (Jagan), ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట, రోడ్లపై మాట్లాడటం కాదు, ఏమైనా అనుమానాలుంటే అసెంబ్లీ (Assembly)కి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెబుతుందని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో రోడ్లపై మాట్లాడి సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా జగన్, ఆయన పార్టీ సభ్యులు సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు. జగన్కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా నేను ఎలా ఇవ్వగలను? మీ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడే మంత్రులు ఉంటారు. వారితో సమాధానం ఇప్పించే బాధ్యత స్పీకర్గా నేను తీసుకుంటా అని తెలిపారు.








