హైదరాబాద్ భక్తులకు పెద్దమనసు… టీటీడీకి భారీ విరాళం
టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీహెచ్ రామేశ్వరరావు (Ch.Rameswara Rao), శ్రీసాయిచందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు (Uddagiri Tatarao)లు రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి ( B.R. Naidu)ని కలిసి విరాళం డీడీలను అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి (Panabaka Lakshmi), రంగశ్రీ (Rangasri) పాల్గొన్నారు.








