17th August 2026

_________

- Bhuvana

తక్కువ బడ్జెట్‌లో అందమైన జ్యువెలరీ.. ఈ డిజైన్స్‌తో లుక్ మార్చేయండి! 

సింపుల్ బ్యాండ్ లేదా చిన్న డిజైన్ ఉన్న సిల్వర్ రింగ్ రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. క్యాజువల్ లుక్‌కు పర్ఫెక్ట్.

మినిమలిస్ట్ సిల్వర్ రింగ్

925 అంటే 1000 భాగాల్లో 925 భాగాలు వెండి ఉన్న ఫైనెస్ గ్రేడ్. కొనేటప్పుడు రింగ్‌పై స్వచ్ఛత వివరాలు చూడండి. 

925 సిల్వర్ రింగ్

డార్క్ యాంటిక్ ఫినిష్‌తో ఉండే ఆక్సిడైజ్డ్ రింగ్స్ ఎత్నిక్, ఇండో-వెస్ట్రన్ దుస్తులతో స్టైలిష్‌గా కనిపిస్తాయి. 

ఆక్సిడైజ్డ్ సిల్వర్ రింగ్

పువ్వులు, ఆకులు వంటి ప్రకృతి మోటిఫ్స్‌తో ఉండే రింగ్స్ సింపుల్ లుక్‌కు ప్రత్యేక ఆకర్షణ ఇస్తాయి. యువతకు ఇవి మంచి ఎంపిక.

ఫ్లోరల్ డిజైన్

సర్కిల్, స్క్వేర్, లైన్ వంటి జ్యామెట్రిక్ ఆకారాల రింగ్స్ మోడ్రన్ లుక్‌ను ఇస్తాయి. జీన్స్, ఫార్మల్ వేర్‌తోనూ జత చేయొచ్చు.

జ్యామెట్రిక్ రింగ్స్

కొంచెం బోల్డ్‌గా కనిపించాలంటే పెద్ద లేదా ప్రత్యేక ఆకారంలోని స్టేట్‌మెంట్ రింగ్ ఎంచుకోండి. ఒక రింగ్‌తోనే లుక్ హైలైట్ అవుతుంది.

స్టేట్‌మెంట్ సిల్వర్ రింగ్

రంగురంగుల స్టోన్స్ లేదా చిన్న రత్నాలతో ఉన్న సిల్వర్ రింగ్స్ సాధారణ డిజైన్‌కు మరింత ఆకర్షణను జోడిస్తాయి. మీకు నచ్చిన రంగును ఎంచుకోండి.

స్టోన్‌తో సిల్వర్ రింగ్