2027 వన్డే వరల్డ్ కప్ కు ఊతప్ప టీమిండియా ఇదే..!
దక్షిణాఫ్రికా, జింబాబ్వే మరియు నమీబియా వేదికలుగా జరగబోయే 2027 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌కు(World Cup) ఇంకా సమయం ఉన్నప్పటికీ.. మాజీ భారత క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన డ్రీమ్ 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించి సంచలనం సృష్టించాడు. దీనిని ఒక ‘బాంబ్ స్క్వాడ్’ (Bomb Squad) గా అభివర్ణించిన ఉతప్ప.. ప్రస్తుతం భారత వన్డే జట్టులో క్రమం తప్పకుండా ఆడుతున్న పలువురు స్టార్ ప్లేయర్లకు ఈ జట్టులో చోటు నిరాకరించడం గమనార్హం.
రాబిన్ ఉతప్ప ఎంపిక చేసిన ఈ జట్టులో అత్యంత షాకింగ్ అంశం ఏంటంటే.. ప్రస్తుత లీడింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరియు పేసర్ హర్షిత్ రానాలను ఆయన పూర్తిగా పక్కన పెట్టేశాడు. వీరి స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే చాలా కాలంగా వన్డే క్రికెట్‌కు దూరంగా ఉన్న వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరియు సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలను తిరిగి జట్టులోకి తీసుకున్నాడు.
వికెట్ కీపర్ స్థానంలో ఇషాన్ కిషన్ కంటే సంజూ శాంసన్‌కే ఆయన మొగ్గు చూపాడు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై అంచనాలు ఎలా ఉన్నప్పటికీ ఉతప్ప తన జట్టులో ఆయనకు చోటు కల్పించాడు. ఉతప్ప ప్రకటించిన ఈ 15 మంది వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ(Rohit Sharma), శుభ్‌మన్ గిల్‌లతో పాటు వైభవ్ సూర్యవంశీ, మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ(Virat Kohli), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లు ఉన్నారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేయగా, స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్‌కు అప్పగించాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ మరియు భువనేశ్వర్ కుమార్‌లను ఎంపిక చేశాడు. రాబోయే ఏడాది కాలం పాటు ఈ 15 మంది ఆటగాళ్లు కలిసి ఆడితే ప్రపంచ కప్‌కు పక్కా ప్రణాళిక సిద్ధమవుతుందని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.








