పెళ్లికి ముందు శృంగారం లీగల్ అయితే? ‘వన్ నైట్ ఓన్లీ’ సినిమా రివ్యూ
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్: 2.5/5
హై కాన్సెప్ట్ కథలు, సినిమాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్‌గానే ఉంటాయి. ట్రైలర్, టీజర్ రిలీజ్ అయినప్పుడు… ఆ కాన్సెప్ట్ గురించి మొదటిసారి విన్నప్పుడు… “అసలు సినిమాలో దీన్ని ఎలా చూపించారు?”, ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతుంది. అలాంటి ఓ విచిత్రమైన, ఆసక్తికరమైన స్టోరీ లైన్‌తో వచ్చిన సినిమా One Night Only.ఓ crazy premise చుట్టూ దర్శకుడు Will Gluck ఒక romantic comedyని అల్లాడు. మరి ఈ కాన్సెప్ట్ తెరపై కూడా అంతే క్రేజీగా మారిందా? యూనివర్శిల్ స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఈ బ్రీజీ రొమాంటిక్ కామెడీ ఎలా ఉంది. చూడదగినదేనా, అసలు ఇందులో ఆ హైకాన్సెప్టు ఏమిటి ?
కథ ఏంటి?
న్యూయార్క్‌లో పెళ్లి కాని జంటల మధ్య శారీరక సంబంధం గత మూడేళ్లుగా చట్టవిరుద్ధం. అయితే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే “One Night Only” అనే ప్రత్యేక రాత్రిలో 12 గంటల పాటు ఆ నిషేధం ఎత్తివేయబడుతుంది. ఈ ప్రపంచ నిర్మాణమే సినిమాకు ప్రధాన హై కాన్సెప్ట్.
ఆ రాత్రి కోసం సిటీ మొత్తం ఒక పెద్ద eventలా సిద్ధమవుతుంది.ఓవెన్ (Callum Turner) Upper Manhattanలో పిజ్జా షాప్ నడుపుతుంటాడు. తన గర్ల్‌ఫ్రెండ్ Malika (Maya Hawke) తో ఈ స్పెషల్ నైట్ ని గడపాలని అతను అనుకుంటాడు. కానీ అతని ప్లాన్‌ను Malika మార్చేస్తుంది.
ఆమె ఈ ఒక్క రాత్రి తమ relationshipను open చేయాలని అనుకుంటుంది. దాంతో Owen ఊహించని సిట్యువేషన్ లో పడతాడు. ఇదే సమయంలో అతనికి Allie (Monica Barbaro) పరిచయం అవుతుంది. Allieకి singer కావాలనే కల. ప్రస్తుతం మాత్రం ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం విచిత్రమైన jingles పాడుతూ డబ్బు సంపాదిస్తుంది.
ఆమెకు కూడా ఈ రాత్రిపై ఓ ఎక్సపెక్టేషన్ ఉంటుంది. కేవలం ఒక క్యాజువల్ ఎనకౌంటర్ కాదు…ఒక నిజమైన కనెక్షన్ దొరకాలని ఆమె కోరుకుంటుంది. అలా ఒకే రాత్రిలో ఇద్దరి జీవితాలు ఒకదానికిఒకటి అడ్డుపడతాయి. అప్పుడు ఏమైంది..చివరకు ఓవెన్ తను అనుకున్నది సాధించాడా లేక Malika ఆలోచన ముందుకు తీసుకెళ్లిందా..మధ్యలో Allie ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందీ సినిమా?
ఈ సినిమా premise ట్రైలర్ లో జనం చూసి ఇంట్రస్టింగ్ అనుకున్నారు. “ప్రభుత్వం ఏడాదిలో ఒక్కరోజు, 12 గంటల పాటు పెళ్లి కాని వాళ్లకు సెక్స్‌ను చట్టబద్ధం చేస్తే ఏం జరుగుతుంది?” అనే ఈ సింపుల్ వెనుక చాలా పెద్ద ప్రపంచాన్ని ఊహించుకున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే 12 గంటల స్వేచ్ఛ కోసం అందరూ ఎదురుచూడటం. ఆ రాత్రిని ఒక festivalలా జరుపుకోవడం ఇవన్నీ జనం ఊహించిన స్దాయిలో అయితే తెరకెక్కలేదు. అయితే రొమాన్స్ కు, కామెడీకు లోటు లేదు. దర్శకుడు దీన్ని ఓ social experimentలా భావించానని అన్నాడు. అయితే experiment అనుకున్న స్దాయిలో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయలేకపోయింది.
అలాగే ఈ కాన్సెప్టు ని వినగానే The Purge సినిమా గుర్తొచ్చింది. 2013లో వచ్చిన The Purgeలో కూడా ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి 12 గంటల పాటు అన్ని నేరాలను చట్టబద్ధం చేసే ప్రపంచాన్ని చూపించింది. అక్కడ 12 గంటల unrestricted freedom. ఇక్కడ 12 గంటల sexual freedom. అందుకే One Night Onlyను చాలామంది “Sex Purge” గా కూడా పిలిచారు.
కానీ రెండింటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. The Purge తన high conceptను భయం, హింస, సామాజిక అసమానత వంటి అంశాలను explore చేయడానికి ఉపయోగించింది. One Night Only మాత్రం అదే structural ideaను తీసుకుని…డేటింగ్, కమిట్మెంట్స్, ప్రేమ , అసూయ వంటి విషయాలు వైపు మళ్లించింది.
ఆ విషయం ప్రక్కన పెడితే.. ఇంత మంచి premise ఇచ్చినప్పుడు చూసేవారికి సహజంగానే చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ చట్టం ఎందుకు వచ్చింది? ప్రజలు దాన్ని ఎలా అంగీకరించారు? చట్టాన్ని ఎవరు అమలు చేస్తారు? ఒకవేళ ఎవరైనా ఆ 12 గంటల దాటి రిలేషన్ పెట్టుకుంటే? ఇలాంటి world-building ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అయితే సినిమా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నించదు. దర్శకుడు ఆలోచన ఒక crazy worldలో ఇద్దరు వ్యక్తులు ప్రేమను ఎలా వెతుక్కుంటారు? అనేదే.
ఎవరెలా చేసారు.
లీడ్ పెయిర్ Callum Turner – Monica Barbaro సినిమాకు పెద్ద బలం. చాలా సహజంగా చేసారు. స్క్రిప్ట్ కొన్ని చోట్ల గాడి తప్పినా… వీరిద్దరూ screenపై కనిపించినప్పుడు సినిమా మళ్లీ trackలోకి వచ్చినట్టు అనిపిస్తుంది.
ఫైనల్ థాట్
“ఏం కాన్సెప్ట్ రా బాబు!” అని ఆశ్చర్యపరిచే ఈ సినిమా. “ఏం సినిమా రా బాబు!” అని చివర్లో అనిపించే స్థాయికి మాత్రం వెళ్లదు. రెండు గంటలు సరదాగా గడపడానికి మాత్రం… One Night Only — ఒకసారి చూడొచ్చు.








