సెప్టెంబర్ 13న ‘Adopt a Highway’ పేరుతో తానా సేవా కార్యక్రమం…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలో వివిధ సామాజిక, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తానా మిడ్-అట్లాంటిక్(TANA Mid-Atlantic) శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అడాప్ట్ ఎ హైవే(Adopt a Highway) కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేవలం పరిసరాలను శుభ్రపరచడమే కాకుండా, సమాజానికి తిరిగి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ , సమయం: సెప్టెంబర్ 13, 2026(ఆదివారం) ఉదయం 9:00 గంటలకు ఈ క్లీనప్ డ్రైవ్ ప్రారంభం కానుంది.
వేదిక: పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మెకానిక్స్బర్గ్ (Mechanicsburg, PA) ప్రాంతంలోని వుడ్స్ డ్రైవ్ (Woods Drive).
మీటింగ్ పాయింట్: 6 వార్మ్ సండే వే, మెకానిక్స్బర్గ్, PA 17050 (6 Warm Sunday Way, Mechanicsburg, PA 17050) వద్ద వాలంటీర్లు అందరూ సమావేశం కావాల్సి ఉంటుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్ గంటలను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు అధికారిక లింక్ Volunteer Registration Portal ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సమాజ అభివృద్ధికి, అందమైన పరిసరాల నిర్వహణకు అందరూ కలిసికట్టుగా అడుగులేద్దాం అంటూ ‘తానా మిడ్-అట్లాంటిక్’ బృందం పిలుపునిచ్చింది.








