TANA: తానా ఆధ్వర్యంలో ఉల్లాసంగా వాలీబాల్, త్రోబాల్ క్రీడా పోటీలు
అమెరికాలోని చార్లెట్ వేదికగా తానా ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ , త్రోబాల్ టోర్నమెంట్ క్రీడా సంబరాలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా , స్థానిక నిర్వాహకుల సారథ్యంలో జరిగిన ఈ పోటీలకు ప్రవాస తెలుగు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ వాలీబాల్, త్రోబాల్ మ్యాచ్లలో క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ చూపిన పోటీతత్వం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
విదేశాలలో స్థిరపడినప్పటికీ తెలుగు యువత , ప్రవాసులు ఇలాంటి క్రీడా వేడుకల ద్వారా శారీరక ఉత్సాహాన్ని పెంపొందించుకోవడంతో పాటు పరస్పరం కలుసుకునేందుకు చక్కటి వేదిక లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్లకు నిర్వాహకులు ప్రత్యేక ట్రోఫీలు, జ్ఞాపికలను అందజేశారు.








