చైనాలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు.. అక్టోబర్ 24, 25 తేదీల్లో షాంఘై వేదికగా నిర్వహణ!
తెలుగు భాష, సాహిత్య వికాసమే ధ్యేయంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా , షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (10th World Telugu Literary Conference) నిర్వహణకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ‘తెలుగు కమ్యూనిటీ ఈవెంట్’ (Telugu Community Event) పేరిట 2026 అక్టోబర్ 24, 25 తేదీలలో (శనివారం, ఆదివారం) చైనాలోని షాంఘై నగరంలో ఉన్న నార్డ్ ఆంగ్లియా ఇంటర్నేషనల్ స్కూల్ (NAIS, Pudong) వేదికగా ఈ సదస్సు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు.
ముఖ్య అతిథులు , ప్రముఖుల భాగస్వామ్యం:
ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు భారత 13వ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అలాగే ఆహ్వానిత అతిథులుగా ప్రముఖ కవి, నటులు డాక్టర్ తనికెళ్ల భరణి, పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరుకానున్నారు.
సహకార సంస్థలు…
విశాఖపట్నానికి చెందిన లోక్ నాయక్ ఫౌండేషన్ సౌజన్యంతో జరుగుతున్న ఈ మహాసభకు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళా సారథి, హైదరాబాద్‌కు చెందిన వంశీ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ , చైనాలోని పలు తెలుగు సంఘాలు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయి. చైనాలో నివసిస్తున్న తెలుగు రచయితలు, పండితులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు ఒకే వేదికపై కలుసుకునేలా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంటోంది.
చైనాలోని షాంఘై, బీజింగ్, షెన్జెన్, యివు, హాంగ్జౌ, గ్వాంగ్జౌ, సుజౌ నగరాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి విశేష స్పందన లభిస్తోంది. మలేషియా నుంచి డాక్టర్ అచ్చయ్య కుమార్ ఆధ్వర్యంలో 15 మంది ప్రతినిధుల బృందం, అమెరికా నుంచి 10 మందికి పైగా సాహితీవేత్తలు ఈ సదస్సులో పాల్గొనడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యక్ష వేదికతో పాటు జూమ్ (Zoom) ద్వారా వర్చువల్ వేదికగానూ సదస్సును అనుసంధానించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
విదేశీ ప్రతినిధులకు వీసా…
భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి షాంఘై నగరానికి వచ్చే ప్రతినిధులు, వక్తలు తమ వీసా , విమాన ప్రయాణ ఏర్పాట్లను వ్యక్తిగతంగా స్థానిక ట్రావెల్ ఏజెంట్ల ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. చైనా టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్‌కు సుమారు 4 నుంచి 6 వారాల సమయం పట్టే అవకాశం ఉన్నందున, 3 నెలల వ్యాలిడిటీతో వచ్చే ఈ వీసా కోసం ఆసక్తిగల ప్రతినిధులందరూ సెప్టెంబర్ మొదటి వారం లోపే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సహాయం కోసం హైదరాబాద్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఖాజా (Mr. Khaza: +91 93932 70293)ను సంప్రదించవచ్చని తెలిపారు.
కార్యనిర్వాహక వర్గం…
ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతం చేసేందుకు విస్తృత కార్యనిర్వాహక వర్గం ఏర్పాటైంది. గౌరవ సలహాదారుగా డాక్టర్ వంశీ రామరాజు వ్యవహరిస్తుండగా.. వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్), మాధవ రెడ్డి కొలన్ (షాంఘై), శాయి రాచకొండ (హ్యూస్టన్), భవాని వాసిరెడ్డి (షాంఘై), నాగ మల్లికార్జున్ (షాంఘై), వర్ణిక (షాంఘై), మౌనిక సుంకర (షాంఘై), జయరామ్ లావేటి (వుహాన్), బలదీప్ (బీజింగ్), మురళి (గ్వాంగ్జౌ-షెన్జెన్), రాధిక మంగిపూడి (ముంబై), రత్న కుమార్ (సింగపూర్), జయ పీసపాటి (హాంగ్‌కాంగ్), లలిత రాచకొండ (హ్యూస్టన్) నిర్వాహక కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని వివరాలకు నిర్వాహకులను సంప్రదించవచ్చు:
మాధవ రెడ్డి కొలన్ (షాంఘై): WhatsApp +91 88860 27778
నాగ మల్లికార్జున్ (చైనా): WeChat ID/Phone: 13162895721
వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, USA): WhatsApp +1 832 594 9054
శాయి రాచకొండ (హ్యూస్టన్, USA): WhatsApp +1 281 235 6641








