విశ్వంభర రిలీజ్‌పై క్లారిటీ వచ్చేదెప్పుడు?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్, తెలుగు సినీ ప్రేక్షకులు సంబరాల్లో ఉండగా.. ఆయన నటిస్తున్న విశ్వంభర(vishwambhara) సినిమాపై మాత్రం మరోసారి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఈరోజు రిలీజైన సినిమాకు సంబంధించిన ఓఎస్టీకి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, రిలీజ్ డేట్‌పై ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న సమయానికి విడుదల కాక ఆలస్యమైంది.
గతేడాది చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విశ్వంభర రిలీజ్లో కొంచెం ఆలస్యం ఉంటుందని, ముందుగా మన శంకర వరప్రసాద్ గారు(mana shankara varaprasad garu) ప్రేక్షకుల ముందుకు వస్తారని క్లారిటీ ఇచ్చారు. అయితే ఏడాది గడిచిన తర్వాత కూడా విశ్వంభర రిలీజ్ ప్లాన్‌పై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దసరా సీజన్లో సినిమాను తీసుకొచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతున్నా.. మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. పైగా ఈ ఏడాది దసరా రిలీజ్‌ల కోసం పోటీ ఇప్పటికే గట్టిగా కనిపిస్తోంది.
మరోవైపు చిరంజీవి తదుపరి సినిమా కాకా(Kaka) సంక్రాంతి 2027 బరిలోకి రానున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఉంది. దీంతో విశ్వంభరకు సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది. పెండింగ్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయడంతో పాటు బిజినెస్ డీల్స్‌ను కూడా వీలైనంత త్వరగా ముగించి రిలీజ్ ప్లాన్ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తుండగా, ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు.








