స్పిరిట్‌పై తగ్గుతున్న అంచనాలు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది ఊహించని షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(sandeep Reddy Vanga) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా స్పిరిట్(Spirit)పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇమేజ్‌కు సందీప్ రెడ్డి వంగా టేకింగ్ తోడవుతుండటంతో ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిలో సెన్సేషన్ సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హీరోయిన్గా త్రిప్తి డిమ్రి(Tripti Dimri) నటిస్తుండటం కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి బయటకు వస్తున్న కొన్ని వివరాలు ఫ్యాన్స్ లో డిస్కషన్‌కు దారితీస్తున్నాయి.
ఇప్పటివరకు స్పిరిట్‌ను ఓ భారీ యాక్షన్ డ్రామాగా ఊహించుకున్న ఫ్యాన్స్.. సినిమా ప్రపంచం, కథా నేపథ్యం విషయంలో కూడా విభిన్నమైన అనుభూతిని ఆశించారు. అయితే ఈ కథ ప్రధానంగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుందనే సమాచారం బయటకు రావడంతో కొందరి అంచనాలు కాస్త మారినట్లు తెలుస్తోంది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కలయికలో వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా విస్తరించిన బ్యాక్‌డ్రాప్ ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు ఈ అంశం కొంత నిరాశ కలిగించినట్టుగా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.
అయితే దీనిని సినిమాకు మైనస్‌గా ఇప్పుడే డిసైడ్ చేయడం తొందరపాటే. సందీప్ రెడ్డి వంగా కథను ఎంత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తారన్నదే అసలు కీలకం. హైదరాబాద్ నేపథ్యాన్నే తీసుకున్నప్పటికీ తనదైన టేకింగ్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో స్పిరిట్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అవకాశముంది. అందుకే అంచనాలు కొంత తగ్గినా.. ప్రభాస్, సందీప్ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.








