నాంపల్లి కోర్టుకు మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageswara Rao)ను ఈడీ (ED) కార్యాలయం నుంచి అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో కారుమూరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌కుమార్(Sunil Kumar), వాసుదేవ రెడ్డి ( Vasudeva Reddy), రాజ్‌కెసిరెడ్డి (Raj KC Reddy)ని అరెస్టు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగాయని, అందులో పెద్దమొత్తం లబ్ధి పొందినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సునీల్‌కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచీలు, రేంజోరోవర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కారుమÖరికి చెందిన రూ.87.7 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.








