ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు : మహేశ్‌కుమార్ గౌడ్
కాంగ్రెస్ నేతలు ఎవరైనా పార్టీ నియమాలు దాటితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా చెప్పుకోవాలని, దీనికోసం వివిధ కమిటీలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ (Delhi) వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ( KC Venugopal)కు చెప్పుకోవచ్చన్నారు. అంతేకానీ పార్టీ లైన్ దాటి బహిరంగ విమర్శలు చేయొద్దని హితవు పలికారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన తర్వాత మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై చర్యలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలా తమది నియంతృత్వ పార్టీ కాదన్నారు. మాట్లాడటానికి పార్టీలో ప్రజాస్వామయ స్వేచ్ఛ ఉంటుందని, కానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మాత్రం చర్యలు ఉంటాయని తెలిపారు.








