సెప్టెంబర్ 2 రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు : బీఆర్ఎస్
కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలన పేరిట బీఆర్ఎస్ (BRS) సమరభేరి మోగించింది. సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ (Congress) మోసగించిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీల పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. బాకీ కార్డు (Baki cards)ల పేరిట కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామగ్రామాన ప్రజలకు కాంగ్రెస్ మోసాన్ని వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.








