14 దేశాలకు పార్టీ అధ్యక్షుల నియామకం : టీఆర్ఎస్
తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) వివిధ దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత (Kavitha) ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్ట్రేలియా (కిషోర్ కత్తి), యూకే ( UK) (సుమన్ రావు బాల్మూరి) కెనడా (Canada) (వెంకట్రామన్ మెట్పల్లి) యూఏఈ (శేఖర్ గౌడ్ ఆరె) సహా 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ (Sulge Srinivas)ను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని కవిత సూచించారు.








