అమెరికా-కెనడా చర్చలు విఫలం..చర్చలు ఇక చాలు అంటూ ట్రంప్ ఫైర్..!
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. చివరి క్షణం వరకూ చర్చలు జరిపినా వాణిజ్య ఒప్పందం ఖరారుకు కెనడా(Canada Trade Talks) నిరాకరించడంతో చర్చలు నిలిచిపోయాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే 20 బిలియన్ల విలువైన వస్తువులపై 50 శాతం సుంకాలు విధించింది అగ్రరాజ్యం.. కెనడా ప్రతి ఏడాది ఆ దేశానికి ఎగుమతి చేసే సుమారు 5 శాతం వస్తువులపై ఇవి ప్రభావం చూపుతాయి. వీటన్నింటికీ సిద్ధమైన కెనడా.. చర్చల నుంచి వైదొలిగింది.
చర్చలు విఫలమవ్వడానికి కారణం మీరంటే .. కాదు మీరంటూ అమెరికా, కెనడా పరస్పర విమర్శలకు దిగాయి. చర్చలువిఫలం కావడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చాలు అంటూ కెనడాతో ట్రేడ్ టాక్స్ ఉండవన్న సంకేతాలిచ్చారు. ఇప్పటికే వారు అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందారన్నారు. మరోవైపు..‘ఈ వారం ప్రారంభంలో అంగీకరించిన నిబంధనల ప్రకారం వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కెనడా నిరాకరించింది. మా మార్కెట్లోకి వస్తువులను ఎగుమతి చేసే దేశాలన్నింటిలోనూ.. కెనడాకు అత్యుత్తమ ప్రాధాన్యత ఇస్తామని ప్రతిపాదించినప్పటికీ వారు అంగీకరించలేదు. వారు కొత్త డిమాండ్లు లేవనెత్తడంతోపాటు మా నిబంధనల నుంచి వెనక్కి తగ్గడం వల్ల చర్చలు దెబ్బతిన్నాయి’ అని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు.
అమెరికా ప్రకటనపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ (Mark Carney) తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యం ప్రతిపాదించిన నిబంధనలలో చివరి నిమిషంలో చేసిన మార్పులు ఆర్థికంగా భారంగా, అన్యాయంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము కూడా అదే స్థాయిలో ప్రతీకార టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదించిన నిబంధనలు అన్యాయంగా, ఆర్థిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.చర్చలు ముగిసే ఆఖరి నిమిషంలో అమెరికా తన నిబంధనలను మార్చిందని, అవి కెనడా స్వార్వభౌమత్వానికి, ఆటోమొబైల్ రంగానికి మరియు సాంస్కృతిక రక్షణకు నష్టం కలిగించేలా ఉన్నాయని కెనడా ఆరోపించింది. అమెరికా “చాలా ఎక్కువగా కోరింది, కానీ చాలా తక్కువ ఆఫర్ చేసింది” అని ప్రధాని కార్నీ విమర్శించారు.
అమెరికా ఏకపక్ష ధోరణికి నిరసనగా తాము వాణిజ్య చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మరియు తమ చర్చల బృందాన్ని వాషింగ్టన్ నుండి ఒట్టావాకు తిరిగి రప్పించినట్లు కెనడా ప్రకటించింది. అమెరికా విధించిన 50 శాతం సుంకానికి (దాదాపు $20 బిలియన్ల విలువైన కెనడా ఉత్పత్తులపై) ప్రతిగా కెనడా కూడా సెప్టెంబర్ 8 నుండి అమెరికా ఉత్పత్తులపై సమాన స్థాయిలో “డాలర్‌కు డాలర్” ప్రాతిపదికన ప్రతీకార టారిఫ్‌లు విధిస్తుందని హెచ్చరించింది. అమెరికా టారిఫ్‌ల వల్ల నష్టపోయే తమ దేశీయ వ్యాపారవేత్తలను, కార్మికులను మరియు రైతులను రక్షించుకోవడానికి కెనడా ప్రభుత్వం అవసరమైన పూర్తి ఆర్థిక మద్దతును అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటినుంచే కెనడా 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ (Donald Trump) డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని కెనడా సర్కారు ఖండిస్తూ వస్తోంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పొరుగుదేశంపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడుతున్నారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్‌లు విధిస్తోంది.








