ఉత్సాహంగా ‘తెలుగు మాట్లాట 2026’ రెండో రోజు వేడుకలు.. విజేతలకు బహుమతుల ప్రదానం!
‘తెలుగు మాట్లాట 2026’ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో రెండో రోజు కొనసాగాయి. ఫైనల్ రౌండ్లు, ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు , ప్రేక్షకులతో వేదిక ప్రాంగణం కళకళలాడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా పోటీల్లో గెలుపొందిన విజేతలు బహుమతులు అందుకున్నారు. గెలుపొందిన వారితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలుగు పౌరులుగా ఒకే వేదికపై తమ ఆనందాన్ని పంచుకున్నారు. మూడు ఆటలు, మూడు వయోవర్గాలు, ఎనిమిది విభాగాలలో నిర్వహించిన ఈ పోటీల విజేతలందరికీ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. రెండో రోజుకు సంబంధించిన మధురమైన జ్ఞాపకాలతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.








