ఫ్యాషన్ సెన్స్ తో మతి పోగొడుతున్న కృతి
ఉప్పెన(Uppena) సినిమాలో బేబమ్మగా పరిచయమై తొలి మూవీతోనే సౌత్ ఇండియా వ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది కృతి శెట్టి(Krithi shetty). కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ నేటితరం క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. తాజాగా కృతి సోషల్ మీడియాలో షేర్ చేసిన క్యాజువల్, క్లీన్-గర్ల్ లౌంజ్వేర్ ఫొటోషూట్ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో లో కృతి శెట్టి చాలా సింపుల్గా, అంతే స్టైలిష్గా కనిపిస్తోంది. రిబ్బెడ్ నిట్ క్రాప్డ్ టాప్, దానికి మ్యాచింగ్ వైడ్-లెగ్ నిట్ ప్యాంట్స్ ధరించి ఫ్యాన్స్ ను మైమరపింపజేస్తోంది.








