జెన్ జీ ని ఆకర్షించేందుకు ఏకంగా కమిటీనే ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జెన్ జీ పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మొన్న జంతర్ మంతర్ దగ్గర సీజేపీ నేతృత్వంలో భారీ ఉద్యమం జరగడం, ఇదంతా కూడా ఇన్ స్టా వేదికగా జరగడంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. అందుకే ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ లో మంత్రులందరూ ఇన్ స్టాలో యాక్టివ్ గా వుండాలని సూచిస్తున్నారు. అందులో ఏం పోస్ట్ చేయాలో కూడా స్వయంగా ప్రధాన మంత్రే చెబుతున్నారంటూ ఎంత జాగ్రత్త పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
మరో వైపు బీజేపీ పార్టీ కూడా జెన్ జీ పై ప్రత్యేక దృష్టి నిలిపింది. నూతనంగా ఎన్నికైన జాతీయ కార్యవర్గం జెన్ జీ పై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ సంస్థాగత కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా యువతను మరింతగా చేరుకునేందుకు జాతీయ కార్యవర్గం ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది.అంతేకాకుండా యువతతో ప్రత్యక్షంగా, నిరంతరంగా సంభాషించేందుకు ‘‘జెన్ జెడ్ అవుట్ రీచ్ అన్న ప్రోగ్రామ్ ను కూడా నిర్వహించేందుకు రెడీ అవుతోంది.
ప్రత్యేక టీమ్ ను ప్రకటించిన బీజేపీ..
ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం బీజేపీ ఏకంగా ఓ టీమ్ ను కూడా నియమించింది. ఈ టీమ్ లో జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, బీజేపీ జాతీయ అధ్యక్షు నితిన్ నబీన్, గురజాత్ మంత్రి హర్ష్ సంఘవి, ఛత్తీస్ గఢ్ మంత్రి ఓపీ చౌదరితో సహా పలువురు నేతలున్నారు. సంస్థాగత అనుభవం వున్న నేతలతో పాటు యువతకు చేరువగా వుండే నాయకత్వాన్ని కలిపి కొత్త తరంతో అనుసంధానం జరిగేలా బీజేపీ వ్యూహం వేసింది.








