జంతర్ మంతర్ నిరసనలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా పోలీసు చర్యలు, నిరసనకారులపై హిం, బల ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వీటిపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వం వహిస్తారు. పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ డాక్టర్ బిష్షోయ్ సభ్యులుగా వుంటారు.
జంతర్ మంతర్ నిరసనల సమయంలో నిరసనకారులు ఆరోపించిన విషయాలపై ఈ కమిటీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుంది. ఇది అత్యంత సున్నితమైన అంశమని, దీనికి ప్రాధాన్యాత ఇవ్వాలని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అలాగే నిరసనల సమయంలో నిరసనకారులపై పోలీసులు, భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా కమిటీ విచారణ చేపట్టనుంది.
అలాగే నిరసనల సమయంలో గాయపడిన వారికి మధ్యంతర పరిహారం అందించే అంశాన్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.గాయపడిన నిరసనకారులతో పాటు గాయపడిన పోలీసు అధికారులకు కూడా మధ్యంతర పరిహారం అందించాల్సి వుందా? అన్న అంశాన్ని కూడా అంచనా వేయాలని కోర్టు ఈ కమిటీకి సూచించింది.








