టిసిఎ హ్యూస్టన్ వారి స్వర్ణోత్సవ పండుగ
అమెరికాలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలుగు సంఘాలలో టిసిఎ హ్యూస్టన్ తెలుగు సంఘం కూడా చేరింది. న్యూయార్క్ లో టిఎల్‌సిఏ, కాలిఫోర్నియాలో బాటా, వాషింగ్టన్ డిసిలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సొసైటీ లు ఇప్పటికే తమ తమ స్వర్ణోత్సవాలు జరుపుకున్నాయి. అయితే ఈ వారంలో హ్యూస్టన్‌లో విజయవంతంగా టిసిఎ స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత కమనీయంగా జరిగింది. జాతీయ సంఘాలు తానా, ఆటా, నాట్స్, టిటిఏ లాంటి జాతీయ సంఘాలు చేసే తెలుగు మహాసభలను తలపించే విధంగా జరిగిన ఈ వేడుకలు వివరాలు ఇప్పటికే ఆన్ లైన్లో, టీవీలలో, యూట్యూబ్ ఛానల్లో వచ్చేసాయి. మరొకసారి వాటి వివరాలు ఇచ్చే బదులు ఈ స్వర్ణోత్సవ వేడుకల ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, ఎవరు ఏ విధంగా శ్రమ పడ్డారు లాంటి వివరాలు పరిశీలిద్దాం.
ప్రజాస్వామ్యం (డెమోక్రసీ) నిర్వచనం లాగా ఈ స్వర్ణోత్సవాలు కూడా కమ్యూనిటీ కోసం కమ్యూనిటీ చేత కమ్యూనిటీ పని చేసిన యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు అదెలాగో చూద్దాం.
ప్రారంభం జనవరి 26లో…
కనకం బాబు, కోనేరు ఆంజనేయులు లాంటి కొందరు పెద్దలు స్వర్ణోత్సవ వేడుకలు చేయాలి అనే ఉద్దేశంతో మొదటగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశారు. ఆ గ్రూపులో తమ ఉద్దేశం తెలిపి సలహాలు ఇవ్వమని కోరారు. అదే సమయంలో యాదగిరి రెడ్డి ప్రెసిడెంట్‌గా టిసిఎ 2026-27కి ఎగ్జిక్యూటివ్ టీం అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. మొదటగా వారు గురు ప్రముఖులు జితేందర్ రెడ్డిని కన్వీనర్‌గా ప్రపోజ్ చేశారు. జితేందర్‌రెడ్డి మొదట ఆ బాధ్యతకి సమ్మతించకపోవడం తరువాత అందరి కోరికపై ఒప్పుకోవటం జరిగింది. ఆ విధంగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ జితేందర్‌రెడ్డి 6 నెలలుగా ఇందుకోసం పూర్తి సమయం కేటాయించి స్వర్ణోత్సవ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. టిసిఏ 40 సంవత్సరాల వేడుకలను 10 ఏళ్ల క్రితం సమర్థవంతంగా నిర్వహించిన శ్రీమతి పద్మశ్రీ ముత్యాలను 50 సంవత్సరాల వేడుక కూడా అంబాసిడర్‌గా ఉండాలని కోరడం పద్మశ్రీ ఆ బాధ్యత స్వీకరించటం జరిగింది. ఆ తరువాత కొంతమంది పెద్దలను వివిధ కమిటీలకు ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది.
వ్యూహరచన (స్ట్రాటజీ ఫార్మేషన్.)..
అన్ని తెలుగు సంఘాలు తాము చేయబోయే కాన్ఫరెన్స్‌కి సంవత్సరం ముందుగా కాన్ఫరెన్స్ ఎక్కడ.. ఎలా చేయాలి.. ఎలా ఉండాలి లాంటి వ్యూహాత్మక విషయాలు అన్నీ డిస్కస్ చేసుకుని ముందుకు వస్తారు. టిసిఏలో కూడా అదే జరిగింది కానీ అది ఓపెన్‌గా జరిగింది. ఎందుకంటే ప్రతి విషయము తయారు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయటం.. దానికి అందులో ఉన్న సభ్యులు దాదాపు వెయ్యి మంది అందరూ వారివారి సలహాలు సూచనలు ప్రశంసలు అడ్డు ప్రశ్నలు పోస్ట్ చేయటం వాటికి మరి కొందరు సమాధానం ఇవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉండేవి. ఇక్కడే పెద్దలు జితేందర్ రెడ్డి, పద్మశ్రీ ముత్యాల నాతో పాటు వంగూరు చిట్టెం రాజు, శ్రీమతి రత్నకుమారి, కిరణ్ నెక్కంటి, శ్రీమతి అనురాధ గోగినేని, ప్రసాద్ కల్వ, బంగారు రెడ్డి, రామ్ చెరువు, శ్రీమతి లలితా కంచర్ల, ఏవీయన్ రెడ్డి, శ్రీమతి ఉమా అండ్ అనేకమంది వారి వారి అభిప్రాయాలు చెప్పి నిర్ణయాలు తీసుకోవటం వాట్సాప్ గ్రూప్‌లో అందరూ తెలుసుకునేలా నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.
సేవ విస్తరణ (అవుట్ రీచ్)..
హ్యూస్టన్ నగరంలో 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కూడా ఉన్న టిసిఏ స్వర్ణోత్సవ వేడుకలకు అందరి సహాయ సహకారాలు కావాలి అని అనుకొని ఇతర సంస్థలైన తానా, ఆటా, నాట్స్, హ్యాట్స్ (హూస్టన్ ఏరియా తెలుగు సీనియర్స్), టిఎజి, తెలుగు భవనం, తెలుగు బడి ఈ కార్యక్రమంలో భాగస్వామ కావాలి అని ఆహ్వానించడం, వారందరూ ఒప్పుకొని తమ మద్దతు ఇవ్వటం జరిగాయి.
స్వాగత గీతం తయారీ: అమెరికాలో జరిగే తెలుగు మహాసభల ఏర్పాట్లలో భాగంగా టిసిఏ కూడా తమ స్వర్ణోత్సవాలలో ఒక స్వాగత గీతం ఉండాలి అని భావించింది. 40 సంవత్సరాల వేడుకలలో అప్పట్లో భువనచంద్ర రాసిన స్వాగత గీతం అందరూ మెచ్చుకున్నారు అని, ఇప్పుడు చేయబోయే గీతం అంతకంటే బాగుండాలని అంతకంటే విభిన్నంగా ఉండాలని వాట్సప్ గ్రూపులో చర్చ ప్రారంభమైంది. అనేకమంది అనేక రకాలుగా తమ తమ సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని సమీకరణం నుంచి అవుట్ లైన్ తో 50 సంవత్సరాలు వేడుకలు స్వాగతం తయారు చేశారు. చివరగా స్వర్ణోత్సవ పండుగలు స్వాగత్ గీతం బాగుందని అందరూ నేర్చుకోవటం అందరికీ సంతోషం కలిగింది.
టిసిఏ మధుర క్షణాలు..
వంగూరి చిట్టెన్ రాజు తన హాస్య చతురతతో కూడిన రచనతో వరుసగా టీసిఏ మధుర క్షణాలు 1, మధుర క్షణాలు క్షణాలు -2.. ఇలా ఒక సీరియల్ ఆర్డర్లో దాదాపు 15 చాప్టర్లలో వివరించారు. ఈ వివరణ వలన అందరికీటిసిఏ ఘన చరిత్ర తెలియటమే కాకుండా ఈ 50 సంవత్సరాల పండుగకి రావాలి అనిపించేలా మోటివేట్ చేసింది.
స్వర్ణోత్సవ వేళలో… ఒక్కో కార్యవర్గం.. ఒక్కో అధ్యాయం
అందరూ ఎంతో శ్రమపడి సంపాదించిన టిసిఏ హిస్టరీ విశేషాలు ఒక్కో సంవత్సరంలో ఉన్న ఒక్కో కార్యవర్గం ఒక్క అధ్యాయం అంటూ ఆ సంవత్సరంలో జరిగిన విశేషాలు వివరాలు వాట్సఅప్ గ్రూపులో ఒక 25 చాప్టర్లుగా ఇచ్చారు. అందువలన ఘనమైన హిస్టరీ, వెనకటి సంవత్సరాలలో పనిచేసిన నాయకులు వారు చేసిన కార్యక్రమం వివరాలు అందరికీ తెలిసాయి ఇవన్నీ గ్రూపులో వివరంగా రావడం వలన టిసీఏ గొప్పతనం అందరికీ తెలియటం అందరూ స్వర్ణోత్సవ కార్యక్రమానికి రావటానికి తయారవడం జరిగింది.
డోనార్లు- స్పాన్సర్లు:
ప్రతి తెలుగు సంఘం చేసే కార్యక్రమ నిర్వహణకు దాతల నుంచి విరాళాలు స్వీకరించ వలసిందే. బిజినెస్ హౌసెస్ని సంప్రదించి స్పాన్సర్స్ గా తేవాల్సిందే. ఇక్కడ కూడా టిసిఎ ఓపెన్ పాలసీ బాగా పనిచేసింది అని చెప్పాలి. ఉదాహరణకు హ్యూస్టన్ పుర ప్రముఖులు, టిసిఎతో ఎంతో అనుబంధం ఉన్న చౌదరి యలమంచిలి 25000 డాలర్ల విరాళం ప్రకటించడానికి వాట్సాప్‌లో పోస్ట్ చేయడం, వెంటనే కన్వీనర్ జితేందర్‌రెడ్డి దగ్గర నుంచి అనేకమంది చౌదరి యలమంచిలిని ప్రశంసిం చడం, అదేవిధంగా ప్రతి డోనార్ గురించి వాట్సఅప్ గ్రూపులో ప్రకటన చేయడం ప్రతి ఒక్కరూ ప్రశంసించటం ఒక మంచి పద్ధతిగా అనిపించింది. ఈ విధమైన గుర్తింపు ప్రశంసలు వలన మరి కొందరు దాతలుగా ముందుకు రావడం జరిగింది.
టిసిఏ కార్యక్రమాలు:
ఒకపక్క దాదాపు 20 కమిటీలు వందమంది పైగా కార్యవర్గ సభ్యులు పెద్దలు స్వర్ణోత్సవ వేడుకకు పనిచేస్తూ ఉండగా, రెండో పక్క టీసిఏ 2026 కార్యవర్గం క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలు ప్రకటించడం విజయవంతంగా నిర్వహించడం చేస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 4-ఉగాది, 3 మే-వన భోజనాలు, 9 మే – ఘంటసాల స్వరమాధురి, 31 మే- వాగ్గేయ కారోత్సవం.. వంటివి చేశాయి. మరోవైపు ఈ స్వర్ణోత్సవ లోగోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆవిష్కరణ.. అమరావతిలో రచయిత వెంకీ చొరవతో టిసిఏ స్వర్ణోత్సవ వేడుక విశేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియటం, టిసిఏ కోరికపై స్వర్ణోత్సవ లోగోని ఆవిష్కరించడం జరిగింది.
ఓపెన్ ప్రమోషన్:
ఈ విధంగా దాదాపు 1000 మందితో కూడిన వాట్సాప్ గ్రూప్ అన్ని వివరాలు విశేషాలు ఇవ్వటం వలన ఈ గ్రూపులోనే పోస్టర్లు, ఫ్లైయర్లు పోస్ట్ చేయటం వలన చాలా ఫోకస్డ్గా ఇన్ఫర్మేషన్ అందరికీ చేరింది. సోషల్ మీడియా వచ్చాక వాట్సఅప్ బాగా వాడుకలోకి వచ్చాక టిసిఏ నాయకత్వం బాగా ఉపయోగించుకుంది అని చెప్పగలము.
టిసిఎ హిస్టరీ
టిసిఏకు 50 సంవత్సరాల ఘనమైన హిస్టరీ ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు అయితే ఆ హిస్టరీ వివరాలు సేకరించి కొత్త సభ్యులకు ప్రస్తుత జనరేషన్ జనరేషన్‌కు అందించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. పెద్దలు మల్లిక్ పుచ్చ, వంగూరు చిట్టెన్ రాజు, శ్రీమతి రత్నకుమారి, శ్రీమతి పద్మశ్రీ ముత్యాల, అనిల్ కుమార్, రామ్ చెరువు లాంటి అనేకమంది చాలా శ్రమపడి తమ దగ్గర ఉన్న టిసిఏ వివరాలు అని అన్ని ఒకచోటకు చేర్చటం మొదలుపెట్టారు. 30 ఏళ్ల క్రితం లేదా అంతకుముందు వాడిన కెమెరాలతో తీసిన ఫోటోలు లేదా వాటి నెగిటివ్‌లు, అప్పట్లో వాడిని వీసిఆర్లు, క్యాసెట్లు సంపాదించి వాటిని డిజిటైజ్ చేసి, డిజిటైజ్ చేసిన తరువాత వాటిలో ముఖ్యమైన వాటిని పెట్టటం లాంటి ఎంతో శ్రమతో కూడిన పనిని చేశారు. ఉదాహరణకి 1975-76లో జరిగిన టిసిఏ మీటింగ్ వివరాలు, 1983లో టిసిఎకి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావుతో జరిపిన మీటింగ్ విశేషాలు మొదలైనవి. క్లిష్టమైన ఈ పనులలో ప్రసాద్ మారగాని చిత్రం రాజ్ ఒంగోలు, శ్రీరామ చావలి, రామ్‌కి, శ్రీమతి పద్మజ కోనేరు, సాయి రాచకొండ, రవికాంత్ పొన్నపల్లి తదితరులు పనిచేశారు.








