ఆరెంజ్ కలర్ శారీలో చూడముచ్చటగా శోభిత
టాలీవుడ్ నటి, అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) కు ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ తో అందరినీ ఆకట్టుకునే శోభితా రీసెంట్ గా తన ఇన్స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శోభితా ఆరెంజ్ కలర్ శారీకి మోడ్రన్ గ్లామర్ ను జత చేసి కనిపించింది. ఆరెంజ్ కలర్ శారీ, దానికి ఎంబ్రాయిడరీ బోర్డర్, చీరకు తగ్గట్టు డిజైన్ చేసిన బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి శోభితా ఎంతో అందంగా మెరవగా, ఈ చీరలో శోభితా అందం చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు.








